కాంగ్రెస్, బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కు: దాడి
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కొలేకే కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు విభజనకు సహకరించారు అని దాడి వీరభద్రరావు ఆరోపించారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఇప్పటికీ చంద్రబాబు వెనక్కి తీసుకోలేదు దాడి అన్నారు. తెలంగాణ బిల్లు పెడతారా లేదా అంటూ మరుగునపడిన విభజన అంశాన్ని బాబు తట్టిలేపారని దాడి విమర్శించారు.
సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాతకూడా సీమాంధ్ర కోసం 5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అడిగిన చంద్రబాబు ఏ రోజూ సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయలేదని దాడి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బిల్లుకు బీజేపీ మద్దతిచ్చేలా ఢిల్లీలో ఉండి చంద్రబాబు లాబీయింగ్ చేశారని దాడి ఆరోపించారు.