
అవినీతిపరులంతా టీడీపీలోనే..
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : టీడీపీలో చేరుతున్నవారంతా కాంగ్రెస్ పాలనలో కొనసాగిన అవినీతి మంత్రులేనని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. పార్టీ 46వ వార్డు నాయకుడు గేదెల రాజు ఆధ్వర్యంలో మల్కాపురంలోని పిలకవానిపాలెం వద్ద సోమవారం రాత్రి భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర లో వైఎస్సార్ సీపీ 130 ఎమ్మెల్యే, 20 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు చెప్పాయన్నారు.
ఈ సర్వేలు అబద్ధమని మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పేర్కొంటున్నారని, నిజానికి ఆయన మనసుకు ఈ సర్వేలు నిజమని తెలుసన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పొందుపరిచిన ఒక్క అంశాన్ని టీడీపీ అమలుచేయలేదని ఆరోపించారు. మేనిఫెస్టోను ఉల్లంఘించిన పార్టీలను ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, ఉత్తరాంధ్ర మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, సీఈసీ సభ్యులు పసుపులేటి ఉషాకిరణ్, పక్కి దివాకర్, దామా సుబ్బారావు, భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం, ప్రచార కమిటీ ప్రతినిధులు గుడ్ల పోలిరెడ్డి, రవిరెడ్డి, డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కలిదండి బద్రినాథ్, గల్లా శ్రీనివాస్, పిల్లా కన్నబాబు, నాయకులు బైపా అరుణకుమారి, ఆల్ఫా కృష్ణ, అంగ రామ్‌ప్రసాద్, భీశెట్టి గణేష్, దేవాదుల త్రినాథ్, తోనంగి వెంకటరమణి, ఎం.సూర్యనారాయణ, నూకరెడ్డి, ధర్మాల అప్పారావు, కర్రి లక్ష్మి, మసేనమ్మ, గొందేశి సత్య నారాయణరెడ్డి, పెద్దడ వెంకటరమణ, అంగ వర్మ, గుంటా సుందరరావు, గౌరీ, గున్నా ధర్మారావు, తామాడ ధర్మారావు, చట్టి నూకరాజు పాల్గొన్నారు. అంతకు ముందు అక్కడి వైఎస్సార్ విగ్రహానికి వీరభద్రరావు తదితర ముఖ్యనాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
పార్టీలో చేరికలు : 49వ వార్డు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలకా రా మ్మోహన్‌రెడ్డి, శంకరరెడ్డి, వరహాలరావు, ఎస్.వి.రమణ, బర్ల అప్పారావు, శీరం శ్రీను, కొల్లి అప్పారావు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరా రు. వారికి దాడి వీరభద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కోశా అప్పలరెడ్డి ఉన్నారు.