సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత కాదని..మహానటుడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దీక్ష చేస్తే సొంత ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదన్నారు. ప్రజలపై ప్రేమతో ఆయన దీక్షలు చేయడం లేదని..కొడుకు భవిషత్తు కోసమే చేస్తున్నారని విమర్శించారు. ‘బీజేపీతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నేతతో రహస్య మంతనాలు జరిపారు. పరపతి కోల్పోతున్న నేతతో కలిసేందుకు బీజేపీ సుముఖంగా లేదని’ తెలిపారు.
పార్టీని వీడేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ..
పార్టీని వీడేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు పాట్లు పడుతున్నారని తెలిపారు. అలిపిరి ఘటన లో సానుభూతి కోసం అప్పట్లో స్కూల్ పిల్లల్ని ఆసుపత్రికి రప్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇసుక ఎక్కడా ఉచితంగా అందలేదన్నారు. భవన నిర్మాణదారుల పేరిట చందాల వసూళ్లకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అలజడి కోసమే బ్లూ ఫ్రాగ్ కంపెనీ ద్వారా ఇసుక పోర్టల్‌ను హ్యాక్ చేయించారన్నారు. గతంలో కీలక సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ ద్వారా చోరీ చేశారని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment