
'ఏపీఎన్జీవోల సభకు వెళ్లేవారికి రక్షణ కల్పించాలి'
ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వెళ్లేవారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు కోరారు
ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వెళ్లేవారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు కోరారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలపై చేసే దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఈ దాడులకు పాల్పడేవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కొనసాగిస్తున్నారని అంతకుముందు దాడి వీరభద్రరావు అన్నారు. లోక్సభ, రాజ్యసభలో టీడీపీ నేతలను రెండుగా విడగొట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దాడి మండిపడ్డారు. పార్లమెంట్లో తెలుగుదేశం సభ్యులు ఆడుతున్న నాటకానికి సూత్రధారి చంద్రబాబేనని అన్నారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం వస్తేనేగాని విభజన నిర్ణయం ఆగదని దాడి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటుందని తెలిపారు.