సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు హై డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు
అనకాపల్లి: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు హై డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు ఎగసి పడుతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను ఆమోదించుకున్నట్లే నేతలు కూడా నడవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, విశాఖ పట్టణంలోని హెచ్‌పీసీఎల్‌లో ప్రమాద గురైన బాధితులను ఆయన పరామర్శించారు. మృతి చెందిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.