
సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో రాజధాని పేరుతో దళితుల భూముల అవినీతిపై తెలుగుదేశం ప్రభుత్వంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. భూమి సేకరణలో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరిగినా మంత్రులపైగానీ, అధికారులపై గానీ ఎటువంటి కేసులు పెట్టరాదని సీఆర్‌డీఏ చట్టంలో సెక్షన్ 146 చేర్చినపుడే ఈ అక్రమాలు చేయడానికి చంద్రబాబు అనుచరులు సిద్దపడ్డారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల సూపర్ ముఖ్యమంత్రిగా, ఒక నియంతలా అమరావతిపై అధికారం చెలాయించింది మాజీ మంత్రి నారాయణ కాదా? అని ప్రశ్నించారు. సీఆర్‌డీఏని మాజీమంత్రి నారాయణ తన సొంత ఎస్టేట్‌లా వాడుకున్నారన్నారు.
ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనటం నిజం కాదా అని ప్రశ్నించారు. అమరావతి భూముల విషయంలో స్టే తెచ్చుకున్న చంద్రబాబు స్టేను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆప్రా యన రంభించిన ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరపకపోతే రిటైర్‌మెంట్ బె నిఫిట్స్‌ను రద్దు చేయాలని ప్రభు త్వానికి విజ్ఞ ప్తి చేశారు.
రిటైర్ అయ్యేలోపు
Comments
Please login to add a commentAdd a comment