నా వ్యాఖ్యలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది
హైదరాబాద్ : తన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. తన వ్యాఖ్యలను రెండు పత్రికలు వక్రీకరించాయని ఆయన మండిడ్డారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల విధానాన్ని ఆ రెండు పత్రికలు ఎందుకు ప్రశ్నించవని దాడి వీరభద్రరావు సూటిగా ప్రశ్నించారు.
ఆత్మ గౌరవ యాత్ర పేరుతో రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సిద్ధాంతమంటూ లేని వ్యక్తి చంద్రబాబేనన్నారు. సోనియా గాంధీని తాము ఎన్నడూ క్షమించమని కోరలేదని అన్నారు. పార్టీ వీడినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని దాడి అన్నారు.విభజన ప్రక్రియను ముగించేందుకు సమైక్యం ముసుగులో సోనియాకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కోవర్టులుగా పనిచేస్తున్నారన్నారు.