స్పష్టతలేని అశోక్బాబు ప్రకటనలు: దాడి | No Clarity in Ashok Babu Comments: Dadi Veerabhadra Rao | Sakshi
Sakshi News home page

స్పష్టతలేని అశోక్బాబు ప్రకటనలు: దాడి

Published Mon, Sep 16 2013 1:43 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

స్పష్టతలేని అశోక్బాబు ప్రకటనలు: దాడి

స్పష్టతలేని అశోక్బాబు ప్రకటనలు: దాడి

మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు కోరే అంశంలో ఏపి ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు భిన్న ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.

విశాఖపట్నం: మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు కోరే అంశంలో  ఏపి ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు భిన్న ప్రకటనలు చేస్తున్నారని  వైఎస్సార్‌ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.  అశోక్‌బాబు వ్యాఖ్యల్లో తేడా కనిపిస్తున్నదన్నారు. ఒక దశలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరారని,  మరో దశలో బిల్లుపై ఓటింగ్‌ సమయంలో  ఆత్మప్రభోదాను సారం నడుచుకోవాలని అశోక్‌బాబు విజ్ఞప్తిచేశారని గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్‌ విషయంలో స్పష్టత ఉండాలన్నారు.  అసెంబ్లీ తీర్మానంతో కేంద్రానికి సంబంధంలేదని చెప్పారు. అలాంటప్పుడు తీర్మానాన్ని అడ్డుకుంటామంటూ కాంగ్రెస్‌ నేతలు చెప్పడంలో అర్థంలేదన్నారు.

అసెంబ్లీలో  తీర్మానం విభజనకు అడ్డుకాబోదని చెప్పారు. రాజ్యాంగ సంక్షోభంతోనే సమైక్యాంధ్ర సాధ్యం అన్నారు. రాజీనామాలతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందని  దాడి చెప్పారు. రాజీనామా కోరితే మంత్రి టీజీ వెంకటేష్‌ మీసం మెలేశారని, మంత్రులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు.  సమైక్యాంధ్ర ఉద్యమంలో మంత్రులు వెన్నుపోటుదారులుగా నిలిచారని విమర్శించారు. మోసాలు మాని మంత్రులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఎన్జీవో సంఘాలు మంత్రులను రాజీనామా చేయమనలేదని మంత్రి టీజీ వ్యాఖ్యలను ఎన్జీవో సంఘాలు సిరీయస్‌గా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాజీనామాలపై మొహమాట పడితే సమైక్యాంధ్ర ఉద్యమం దెబ్బతింటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement