సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ నిన్న విలేకర్ల సమావేశంలో చూపిన వీరావేశం అంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరిగిందని దాడి వీరభద్రరావు ఆరోపించారు.కిరణ్కు సమైక్య రాష్ట్రంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
సమైక్య రాష్టం కోసం నిజాయితీగా ఉన్నట్లు ప్రకటించిన మీరు ఎంపీల రాజీనామాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సీఎం కిరణ్ను ప్రశ్నించారు. సమైక్య ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవడంలో భాగంగానే సీఎం కిరణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారని అన్నారు.