
'ఎ1 ముద్దాయి సోనియా గాంధీ'
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ ఇప్పటికీ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పదేపదే కేంద్రానికి గుర్తు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విభజన విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక మోసం చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.
విభజన వ్యవహారంలో ఎ1 ముద్దాయి సోనియా గాంధీ, ఎ2 ముద్దాయి చంద్రబాబు, ఎ3 ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కొందరు సభ్యులు దేశప్రతిష్టను మంటగలిపే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు.