చంద్రబాబు జగన్ నామస్మరణ! | Chandrababu Naidu should say Apology to Telugu people: Dadi Veerabhadra Rao | Sakshi
Sakshi News home page

చంద్రబాబు జగన్ నామస్మరణ!

Published Sat, Feb 22 2014 4:53 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

దాడి వీరభద్రరావు - Sakshi

దాడి వీరభద్రరావు

హైదరాబాద్:  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు కళ్లు మూసినా, తెరిచినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  కనిపిస్తున్నారన్నారు. ఆయన జగన్ నామ జపం చేస్తున్నారని చెప్పారు.  జగన్‌కు ఉన్నంత దమ్ము, ధైర్యం నీకుందా చంద్రబాబు? జగన్‌ను విమర్శించడానికి నీకు సిగ్గులేదా? అని దాడి అడిగారు.

తెలుగు జాతి రెండు మక్కులవడానికి కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  పార్లమెంట్‌లో కాంగ్రెస్, బిజెపితో పాటు టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు.  పార్లమెంటులో ఒక్క సవరణ ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణకు కెసిఆర్ ఫాదర్ అయితే, బాబు గ్రాండ్ ఫాదర్‌ అని చెప్పారు. తెలుగు దేశం అధినేతగా ఉండడానికి ఆయన అర్హులు కారన్నారు. ఆ పార్టీ పేరును తెలంగాణ పేరుగా మర్చుకుని  అధ్యక్షులుగా ఉండమని దాడి సలహా ఇచ్చారు.

రాజధానికి లక్ష కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరే? అని ప్రశ్నించారు. సీమాంధ్ర తగలబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సృష్టించింది చంద్రబాబు కాదా? అని దాడి అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement