
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా తానే అధికారంలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా అధికారులను తన గుప్పెట్లో ఉంచుకోవాలనే భావనతో అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ ఆయన రాసింది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు వాస్తవం అని తేలిందని పేర్కొన్నారు.
(టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?)
ఆయనకు ఆ బాధే ఎక్కువగా ఉంది..
చంద్రబాబుకు కరోనా కంటే రాజధానిని ఎక్కడ విశాఖకు తరలించేస్తారనే బాధే ఎక్కువగా ఉందన్నారు. విశాఖకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లను కోర్టులో వేయించడం వెనుక విశాఖపై ఆయనకి ఉన్న విష సంస్కృతికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీలకు ఇవ్వకూడదనే తీర్పుపై రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశామని దాడి వీరభద్రరావు తెలిపారు.
(అది భయంకరమైన లేఖ : అంబటి)