ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.