dadi rathnakar
-
అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల భారీ ర్యాలీ
-
టీడీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది
-
వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. జననేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు అక్కడ ఉన్నారు. సతీశ్ వర్మ కూడా.. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. చదవండి: వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ -
వైఎస్సార్సీపీకి దాడి రాజీనామా
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రకటించారు. తనతోపాటు తన కుమారుడు దాడి రత్నాకర్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు. కొంతకాలం ప్రశాంతంగా ఉండి.. ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. అదే సమయంలో ఆయన తమ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం గమనార్హం. వైఎస్సార్సీపీలో చేరి చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే తాను ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని దాడి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు. విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుమారుడు రత్నాకర్ ఓడిపోవడం తనకు సంతోషకరమేనని ఆయన చెప్పడం గమనార్హం. విలేకరుల సమావేశంలో దాడి రత్నాకర్ కూడా పాల్గొన్నారు. -
ఈవీఎం స్ట్రాంగ్‌రూం వద్ద ఆగంతకుల కదలిక
విశాఖ : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని సోఫియా కళాశాల స్టాంగ్ రూం వద్ద ఆగంతకులు సంచారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎన్నికల ఏజెంట్‌తో ఓ పోలీసు అధికారి మంతనాలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరపాలని దాడి రత్నాకర్ భన్వర్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు మూడంచెల పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసినా వాటి భద్రత మాత్రం సవాల్‌గా మారుతోంది. కాగా ఈ నెల 16న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.