
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. జననేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు అక్కడ ఉన్నారు.
సతీశ్ వర్మ కూడా..
విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు.
చదవండి:
వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment