సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు 10 వేల కోట్ల రూపాయలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం హెరిటేజ్ పాల వ్యాన్లు, నారాయణ విద్యాసంస్థల, బ్యాంకు వాహనాలు, ఆఖరికి అంబులెన్సులను కూడా వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తప్ప బీజేపీ నేతలందరితో చంద్రబాబుకు సత్సంబంధాలే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. గెలుపు కోసం ఆయన ఎంత నీచానికైనా దిగజారుతారని దుయ్యబట్టారు.
చదవండి : (ఎన్నికల వేళ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు)
దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రచార సభకు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment