
సాక్షి, అమరావతి : ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమర్ధించడం సాహసోపేత నిర్ణయంగా పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల తర్వాత భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. పాకిస్థాన్.. చైనాలకు ఆశ్రయం ఇచ్చే శక్తులకు భారత్‌లో చోటు లేకుండా చెయ్యాల్సిందేనని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment