సాక్షి, అల్లూరి: చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది ఆయనకి.
నక్కా ఆనంద్ బాబు తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు.
మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం. అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. దీంతో నక్కా ఆనంద్‌బాబును అడ్డుకోవడం ద్వారా టీడీపీ అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు కార్యకర్తలు.
Comments
Please login to add a commentAdd a comment