
దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్‌మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది.
(చదవండి: గ‍్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు! )
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే తన 40వ పుట్టినరోజు (మే 20) కూడా ఇదే రోజు కావడంతో.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment