సోదరుడు మరణిస్తే సంభ్రమాశ్చర్యానికి గురైన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ.. తాజాగా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని వర్ధంతిని చేశారు. తత్తరపాటుకు లోనవ్వడంలో అల్లుడు నారాలోకేశ్‌ను మించిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కొట్టుకుపోయినా బాలయ్య మాత్రం హిందూపురం నుంచి రెండోసారి విజయం సాధించారు. మంగళవారం తన తండ్రి జయంతి వేడుకులను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి సతీమణి వసుంధరతో కలిసి పాలభిషేకం చేశారు. అనంతరం హిందూపురంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 96వ జయంతిని కాస్త వర్థంతిగా వ్యాఖ్యానించారు