
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని.. కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని.. ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు.
ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవించేవారని.. కానీ నేటి టీడీపీ నేతలు మహిళల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూడా సరిగా పట్టించుకోవడం లేదని.. పెచ్చులూడుతున్నాయని తెలిపారు. ఇది ఎన్టీఆర్‌కు అవమానం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గమనించి ఘాట్‌కు మరమ్మతులు చేయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment