హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు.
సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ సమాధివద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్ అమర్ రహే' అంటూ కార్యకర్తలు నినదించారు. పలువురు ఎమ్మెల్యేలతో మాటామంతి జరుపుతూ సీఎం చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు.
అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..
Published Mon, Aug 31 2015 8:45 AM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM
Advertisement
Advertisement