
సాక్షి, విజయవాడ : గుడివాడ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం పుట్టగుంట, లక్ష్మీ నరసింహపురం గ్రామాల నుంచి వందలాది మంది మహిళలు పార్టీలో చేరుతున్నారు. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని మహిళలకు కండువాలు కప్పి.. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు తమకు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి పాటుపడే వైఎస్ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. పసుపు- కుంకుమ పేరిట సీఎం చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. ‘నిన్ను నమ్మం బాబు’ అంటూ నినాదాలు చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముకున్న డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పార్టీని వీడుతుండటంతో కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment