
తాడేపల్లిగూడెం(ప.గో. జిల్లా): చంద్రబాబు-పవన్ కల్యాణ్ సమావేశంపై మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. అవకాశవాద రాజకీయాల కోసమే వారి సమావేశమని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
‘పవన్ అవకాశవాది. పవన్ తీరుతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ తాకట్టుపెట్టాడు.ఆర్థిక లబ్ధి కోసమే చంద్రబాబును పవన్ కలిశాడు’ అని మంత్రి విమర్శించారు.
చంద్రబాబు, పవన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, పేద ప్రజల ప్రాణాలన్నా వారికి లెక్కలేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు.