సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.
విశాఖలో మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీఠ వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు.
ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టాము. తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతి రావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వైఎస్ కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరారు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment