ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి విడనాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
తణుకు (పశ్చిమగోదావరి జిల్లా): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి విడనాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పట్టణంలో పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి.
ఇందులో కారుమూరితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. ఉదయం 4 గంటల నుంచే బస్సులను అడ్డుకున్నారు. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్చందగా మూసి బంద్‌కు సహకరించారు.