తెలంగాణ విమోచనదినం కోసమే తిరంగా యాత్ర | BJP tiranga yatra | Sakshi
Sakshi News home page

తెలంగాణ విమోచనదినం కోసమే తిరంగా యాత్ర

Sep 3 2016 11:42 PM | Updated on Sep 4 2017 12:09 PM

మాట్లాడుతున్న విక్రమ్‌రెడ్డి

మాట్లాడుతున్న విక్రమ్‌రెడ్డి

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనదినం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తోనే బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా యాత్ర మోరంపల్లిబంజర గ్రామంలో శనివారం ప్రారంభమైంది.

  • బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి
  • బూర్గంపాడు: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనదినం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తోనే బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా యాత్ర మోరంపల్లిబంజర గ్రామంలో శనివారం ప్రారంభమైంది. వందలాదిమంది యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు  మోటార్‌సైకిల్‌ ర్యాలీతో యాత్రలో పాల్గొన్నారు. సారపాక ప్రధానకూడలిలో జరిగిన సభలో విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ... 29వ కొత్తరాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా బీజేపీ చేపట్టిన తిరంగాయాత్రలో ప్రజలందరు పాల్గొనాలని, సెస్టెంబర్‌ 17న వాడవాడలా జాతీయజెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చందా లింగయ్య, భూక్యా సీతారామ్‌నాయక్, యర్రంరాజు బెహరా, ఏనుగుల వెంకటరెడ్డి, బి శ్రీనివాసరెడ్డి, మహంకాళి వెంకటరమణ,  జీ సతీష్, అన్వేష్‌రాజు, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement