ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర | Sended sFI saikil yatra | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర

Published Thu, Aug 11 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న సైకిల్‌యాత్ర బుధవారం మిర్యాలగూడలో ముగిసింది.

మిర్యాలగూడ అర్బన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న సైకిల్‌యాత్ర బుధవారం మిర్యాలగూడలో ముగిసింది. ఈ సందర్భంగా పట్టణంలోని గల్స్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌ మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెస్‌బిల్లులు పెంచాలని డిమండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, కళాశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల విద్యాసాగర్, ఖమ్మంపాటి శంకర్, సైదా, సాయి, వెంకటేశ్, నరేష్, సూర్య, భాను తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement