
న్యూఢిల్లీ: ప్రయాణ సంబంధ సేవలందించే యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందింది. యాత్రా ఆన్‌లైన్ ఇంక్‌కు దేశీ అనుబంధ సంస్థ అయిన కంపెనీ ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93,28,358 షేర్లను కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి.
ఈక్విటీ జారీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, కస్టమర్లను ఆకట్టుకునే పెట్టుబడులు తదితర వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. 700 భారీ కంపెనీలు కస్టమర్లుగా కలిగిన యాత్రా ఆన్‌లైన్ దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ సర్వీసుల విభాగంలో ముందుంది.
చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్!