దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల జనవరి 3వ తేదీ నుంచి మెదక్ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఆపార్టీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్, భిక్షపతి విలేకర్లతో మాట్లాడుతూ... పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 13 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం మూడు రోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.