చంఢీగర్: హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్‌ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..
Comments
Please login to add a commentAdd a comment