
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగంపేట మండలం ఐలాపూర్, నాగిరెడ్డిపేట మండకం వడల్ పర్తి గ్రామాల్లో ఈ యాత్ర సాగుతుండగా.. షర్మిలకు అడ్లూరు ఎల్లారెడ్డిలో ప్రజలు, రైతులు స్వాగతం పలికారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
చదవండి: ఏ అధికారంతో వరి వద్దంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment