హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో! | Actor Dhanush Son Yatra In Trouble Police Complaint Filed | Sakshi
Sakshi News home page

Dhanush: మైనర్ కొడుకు చేసిన పొరపాటు.. హీరో ధనుష్‌కి షాకిచ్చిన పోలీసులు!

Published Sat, Nov 18 2023 4:54 PM | Last Updated on Sat, Nov 18 2023 4:57 PM

Actor Dhanush Son Yatra In Trouble Police Complaint Filed - Sakshi

అతడు ఓ స్టార్ హీరో కొడుకు. అనుకోకుండా ఓ పొరపాటు చేశాడు. దీంతో సదరు హీరో ఇంటికి పోలీసులు వచ్చారు. అసలేం జరిగిందో చెప్పి క్లారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)

అసలేం జరిగింది?
స్టార్ హీరో ధనుష్ పేరుకే తమిళోడు కానీ తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ధనుష్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య ఐ‍శ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం ఇద్దరితోనూ ఉంటున్నారు. తాజాగా ధనుష్ పెద్ద కొడుకు యాత్ర.. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

ఆ పొరపాటు చేశాడు?
అయితే ధనుష్ కొడుకు యాత్ర వయసు 15 ఏళ్లే. అలాంటిది డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా తాము నివసిస్తున్న పోయస్ గార్డెన్ ఏరియాలో బైక్ నడిపాడు. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. బైక్ పై ఉన్నది ధనుష్ కొడుకా కాదా అని స్వయంగా ఇతడి ఇంటికొచ్చి కన్ఫర్మేషన్ తీసుకున్నారు. అతడే అని తేలడంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను రూ.1000 జరిమానా విధించారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement