7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర | Bc Chaitanya Yatra from 7th | Sakshi
Sakshi News home page

7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర

Published Fri, Aug 3 2018 2:23 AM | Last Updated on Fri, Aug 3 2018 2:23 AM

Bc Chaitanya Yatra from 7th - Sakshi

హైదరాబాద్‌: పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలనే నినాదంతో రాష్ట్ర బీసీ విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి వచ్చే నెల 11 వరకు ‘బీసీల రాజకీయ చైతన్య యాత్ర’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 1990 ఆగస్టు 7న మండల్‌ కమిషన్‌ సిఫార్సును అమలు పరిచిన రోజును పురస్కరించుకుని ఆ రోజు నుంచే యాత్ర ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 7న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో యాత్ర ప్రారంభ మవుతుందన్నారు.

8న వనపర్తి జిల్లా, 9న మహబూబ్‌నగర్, 10న కల్వకుర్తి, 11న నల్ల గొండ, 13న మిర్యాలగూడ, 14న సూర్యాపేట, 16న భువనగిరి యాదాద్రి, 17న జనగాం, 18న వరంగల్‌ అర్బన్, 19న వరంగల్‌ రూర ల్, 20న మహబూబాబాద్, 21న ఖమ్మం, 22న కొత్తగూడెం, 23న జయశంకర్‌ భూపాల్‌పల్లి, 24న పెద్దపల్లి, 25న మంచిర్యాల, 27న ఆసిఫాబాద్, 28న ఆదిలాబాద్, 29న నిర్మల్, 30న నిజామాబాద్, సెప్టెంబర్‌ 1న కామారెడ్డి, 2న రాజన్న సిరిసిల్ల, 3న జగిత్యాల, 4న కరీంనగర్, 5న సిద్దిపేట, 6న మెదక్, 7న సంగారెడ్డి, 8న వికారాబాద్, 9న రంగారెడ్డి, 10న మేడ్చల్, 11న హైదరాబాద్‌లో సభతో ముగు స్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ సంఘం నేత నర్సింహా సగర, సంఘం యూత్‌ అధ్యక్షుడు శ్యామ్‌కురుమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement