
బైక్ యాత్ర చేస్తూ చిత్తూరు చేరుకున్న వీరబాబు
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాను.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా.
రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు.
చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు
Comments
Please login to add a commentAdd a comment