
అనకాపల్లి టౌన్: ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని కోరుతూ జగన్ వీరాభిమాని పాస్టర్ అడవికొట్టు రాజు చేపట్టిన బైక్ యాత్రకు స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి సోమవారం ఘన స్వాగతం లభించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మే 15వ తేదీన తన బైక్ యాత్ర ప్రారంభించాడు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలం సీహెచ్‌ఎన్ అగ్రహారం చేరుకున్నాడు.
ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిశాడు. జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న రాజు సంకల్పం నెరవేరాలని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సదరు వ్యక్తి బైక్ యాత్ర పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment