పాదయాత్రకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే పరిశీలిస్తామని గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. బుధవారం కిర్లంపూడిలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
-
గతంలో జరిగిన అల్లర్య దృష్ట్యా భారీ బందోబస్తు
-
పోలీసు వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తుంది ∙ జిల్లా ఎస్పీ రవిప్రకాష్
కిర్లంపూడి :
పాదయాత్రకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే పరిశీలిస్తామని గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. బుధవారం కిర్లంపూడిలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కిర్లంపూడి పోలీస్‌స్టేష¯ŒSలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరిగినా బాధ్యత వహిస్తానని హామీ పత్రాన్ని ఇస్తే షరతులతో కూడిన అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. నెల్లూరు ఎస్పీ విశాల్‌గున్ని, ఏఎస్పీలు ఫకీరప్ప, అద్నా¯ŒSనమూమ్ ఆజ్మీ ఉన్నారు.