మృతదేహాన్ని చూస్తున్న మహిళలు
పండితాపురం గ్రామంలో వినాయకుడి ఊరేగింపులో కాల్చిన బాణసంచా శబ్దాలతో ఆవులమంద బెదిరి.. ఒక్కసారిగా మీదికి దూసుకురావడంతో శోభాయాత్ర చూస్తున్న ధనియాకుల శకుంతల(50) కిందపడిపోగా, ఆవులు ఆమెను తొక్కుకుంటూ పోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది.
-
బాణసంచాతో బెదిరిన ఆవులు గుద్దుకొని మహిళ దుర్మరణం
కామేపల్లి: పండితాపురం గ్రామంలో వినాయకుడి ఊరేగింపులో కాల్చిన బాణసంచా శబ్దాలతో ఆవులమంద బెదిరి.. ఒక్కసారిగా మీదికి దూసుకురావడంతో శోభాయాత్ర చూస్తున్న ధనియాకుల శకుంతల(50) కిందపడిపోగా, ఆవులు ఆమెను తొక్కుకుంటూ పోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఆవులు బలంగా గుద్దుకుంటూ ముందుకెళ్లిపోగా..కిందపడి స్పృహ కోల్పోయిన ఈమెను వైద్యం నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కాగా మరొక నలుగురు మహిళలు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని కామేపల్లి తహసీల్దార్ కె.లక్ష్మణస్వామి, ఇల్లెందు సీఐ నరేందర్ పరిశీలించారు. ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ బానోత్ కస్తూరిబాయి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బానోత్ నర్సింహానాయక్, సొసైటీ చైర్మన్ బోడేపూడి రమేష్‌బాబు తదితరులు సంతాపం తెలిపారు.