
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రారంభమవుతోంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘భలేమంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు పేదల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవటానికి ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించి, 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచారు.
ఇప్పుడు ‘యాత్ర’ సినిమా కూడా నాన్‌స్టాప్ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నాం. ఈరోజు షూటింగ్ మొదలుపెట్టి సెప్టెంబర్‌కి పూర్తి చేస్తాం. టాలీవుడ్‌లో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్‌గా చెప్పవచ్చు. వైఎస్‌గారి బయోపిక్ గురించి దర్శకుడు మహి చెప్పిన విధానం నచ్చి, చాలా గ్యాప్ తర్వాత మమ్ముట్టి తెలుగులో నటిస్తున్నారు. ముఖ్యంగా మడమతిప్పని పాత్ర కావటం వల్ల వైఎస్‌గారి బాడీలాంగ్వేజ్‌ని ఆయన బాగా అవగాహన పట్టి, పూర్తి డెడికేషన్‌తో ఈ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. మా ప్రొడక్షన్ విలువలు రెట్టింపు చేసేలా, ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘యాత్ర’ నిర్మిస్తాం’’ అన్నారు.
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....!
ప్రతి గడపలోకి వస్తున్నా
యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్
సబితగా సుహాసిని
వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment