బిగ్‌బాస్‌: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా? | Bigg Boss Gives Another Twist To Spectators In this Week | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 30 2018 7:41 PM | Last Updated on Tue, Jul 31 2018 4:15 PM

Bigg Boss Gives Another Twist To Spectators In this Week - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా మారింది. హౌస్‌ మేట్స్‌ కుట్రలు, కుతంత్రాలు అంటూ పెట్టుకునే గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అయితే ఈ రియాల్టీ షో సాంప్రదాయానికే విరుద్దంగా ఎన్నడూ.. ఎక్కడా లేని విధంగా బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌కు మరో అవకాశం ఇచ్చాడు. అది కూడా ప్రేక్షకుల ఓట్ల ద్వారా అని చెప్పి కావాల్సిన హైప్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఇక ప్రేక్షకులు వారి అభిమాన కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపించడానికి ఓట్లతో పోటీపడ్డారు. దీంతో ఏకంగా ఎన్నడూ లేనివిధంగా 11 కోట్ల పై చిలుకు ఓట్లు నమోదయ్యాయి. ఈ ఓట్లన్ని ఆరుగురు కంటెస్టెంట్స్‌కు రాగా.. మేజార్టీ సాధించిన ఇద్దరికి మాత్రం స్పల్ప తేడా ఉండటంతో ఎవరూ ఊహించని విధంగా ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఆ ఇద్దరికి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌.

ఆ ఇద్దరు కామన్‌ మ్యాన్‌ నూతన్‌ నాయుడు, యాంకర్‌ శ్యామల అన్న విషయం ముందే తెలిసిపోయినా.. ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని రివీల్‌ చేశాడు. కానీ హౌస్‌లోకి ఎప్పుడు వెళ్లాలనేది మాత్రం బిగ్‌బాస్‌ నిర్ణయిస్తాడని ప్రకటించాడు. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని మాత్రం చెప్పలేదు. నిజానికి ఏ వారం ఎలిమినేషన్‌లో కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు.  ఈ ఇద్దరు హౌస్‌లోకి  వెళ్లే అంశంపై ఈ రోజు ఎపిసోడ్‌లో స్పష్టత రానుంది.

ఇద్దరు ఎంట్రీ.. మరో ఇద్దరు ఔట్‌!
ఏదైనా జరుగొచ్చు అన్నట్లు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు.. అయితే వీరి రాకతో ఈసారి ఎలిమినేషన్‌లో డబుల్‌ ధమాకా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌ చివర్లో ఈ విషయంపై నాని కొంత స్పష్టతను ఇచ్చి.. ఇవ్వనట్లు వదిలేశాడు. ఆ మాటలను బట్టి చూస్తే ఈ సారి కచ్చితంగా హౌస్‌ నుంచి ఇద్దరు నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ రియాల్టీ షో 50 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ఇంకా మరో 50 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఇటీవల వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన పుజా రామచంద్రన్‌తో కలిపి 12 మంది సభ్యులున్నారు. తాజాగా మరో ఇద్దరు చేరనున్నారు. మొత్తం ఆ సంఖ్య 14కు చేరనుంది. చివరి వారానికి ఐదుగురు మిగులుతారు. ఇలా వారానికి ఒక్కరిని వేసుకున్నా 7గురు మాత్రమే బయటకి పోతారు. కాబట్టి ఈ లెక్కన ఓ రెండు వారాలు ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. 

అనుకున్నది ఒకటి అయినది ఒకటి.. 
ఇక సోమవారం ఎపిసోడ్‌లో గార్డెన్‌లో  ఏర్పాటు చేసిన 1-12 ర్యాంక్స్‌ బోర్డుల వద్ద కంటెస్టెంట్స్‌ హౌస్‌లోని తమ ర్యాంకు ఏంటో నిర్ణయించుకోని ఆ ర్యాంకు వద్ద నిలబడాలని, ఒక ర్యాంకు దగ్గర ఒక్కరే నిలబడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. తనీష్‌-1, రోల్‌రైడా-2, కౌశల్‌, దీప్తి-3, సామ్రాట్‌-4, అమిత్‌-5, దీప్తీ సునయన-6, గణేశ్‌-7, బాబుగోగినేని-8, గీతామాధురి-9, నందిని-10, పుజారామచంద్రన్‌-12 ర్యాంకుల వద్ద నిలబడ్డారు. ఇక తమకు తాము ఎక్కువ ర్యాంకు ఇచ్చుకున్న కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్‌ ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియకు డైరెక్ట్‌గా నామినేట్‌ చేశాడు. కెప్టెన్‌ అయినందుకు గీతా మాధురి, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పుజాలను ఎలిమినేషన్‌ నుంచి తప్పించాడు. ఇక మూడో ర్యాంకు కోసం గొడవ పడ్డ కౌశల్‌, దీప్తీలను ఏకాభిప్రాయానికి రానందుకు ఇద్దరినీ బిగ్‌బాస్‌ నామినేట్‌ చేశాడు. తను ఎలాగైన నామినేట్‌ అయ్యేదని, కానీ ఆమెతో కౌశల్‌ను కూడా నామినేషన్‌లోకి తీసుకొచ్చిందని హౌస్‌ మేట్స్‌ పడిపడి నవ్వుకున్నారు. 

ఈ వారం ఇద్దరైతే..?
ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంటే బాబుగోగినేని, దీప్తిలకు ఎలిమినేషన్‌ తప్పేట్టు లేదు. బాబుగోగినేని గత వారం మొత్తం ఆయన ప్రవర్తించిన తీరు ప్రేక్షకుల్లో చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా కౌశల్‌, గీతా మాధురిలతో ఆయన ప్రవర్తించిన తీరు రాజమౌళీపై కామెంట్స్‌.. హౌస్‌లోనే కాకుండా టీవీల ముందున్న వారికి చికాకు తెప్పించింది.  మరో వైపు ఆయన కేసుల వ్యవహారం కూడా బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు నోటీసులు కూడా అందజేశారు. ఈ పరిస్థితుల్లో ఆయనను హౌస్‌లో కొనసాగించి బిగ్‌బాస్‌ రిస్క్‌ తీసుకోలేడని అర్థమవుతోంది.  

ఇక రెండో వ్యక్తిగా నందినీ, దీప్తీలకు ముప్పు ఉంది. అయితే ఈ ముగ్గురిలో దీప్తీ ఎలిమినేషన్‌ తప్పెట్టు లేదు. నిజానికి ఆమె భాను శ్రీ సమయంలోనే ఆమె బయటకు వెళ్లాలి.. కానీ పరిస్థితులు అనుకూలించి ఉండిపోయింది. మంచి-చెడు టాస్క్‌లో జరిగిన గొడవ దీప్తీని రెండు వారాలు రక్షించింది. ఆమె ర్యాంకింగ్‌ టాస్క్‌లో ప్రవర్తించిన తీరు కొంత అభ్యంతరకరంగానే ఉంది. అయితే ఇది ప్రేక్షకులు పాజిటీవ్‌గా? లేక నెగటీవ్‌గా తీసుకుంటారా అన్న విషయంపైనే ఆమె ఎలిమినేషన్‌ ఆధారపడి ఉంది. 

ఇక నందినిది కూడా బాబు పరిస్థితే. ఆమె ఒకరి విషయాలు మరొకరి వద్ద ప్రస్తావించడం.. అర్ధరాత్రి తనీష్‌తో రోమాన్స్‌ చేయడం.. ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అయితే తాజా ఎపిసోడ్‌ దీప్తీ ప్రవర్తన నందినికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహరంతో కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ ఈ వారం బతికిపోయినట్టే. ఇప్పటికే ఈ ఎలిమినేషన్ల వ్యవహారంపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్‌ జరుగుతోంది. ముఖ్యంగా బాబుగోగినేని, దీప్తీ, నందినిలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

రీక్రియేషన్‌..
బిగ్‌బాస్‌ షో మొత్తం కమర్షియల్‌ అన్న విషయం తెలిసిందే. స్పాన్సర్‌ బ్రాండ్స్‌ ప్రచారం కోసమే టాస్క్‌లు సైతం నిర్వహిస్తున్నారు. ఇది తొలి వారంలోనే స్పష్టమైంది. సోమవారం ఎపిసోడ్‌ను సైతం బిగ్‌బాస్‌ అలానే ప్లాన్‌ చేశాడు. హౌస్‌ మేట్స్‌ బాల్యం ఫొటోలు చూపించి వాటిని రీక్రియేషన్‌ చేయాలని ఓ టాస్క్‌ ఇచ్చాడు. దీనికి ఈ షోకు స్పాన్సర్‌గా ఉన్న ఓ కంపెనీ మొబైల్‌ ఫోన్స్‌ను వాడుకోవాలని సూచించాడు. అయితే హౌస్‌ మేట్స్‌ ఫొటోలు కొంత ఆకట్టుకున్నా.. ఈ టాస్క్‌ పూర్తిగా యాడ్‌లా అనిపించింది. అందరు కంటెస్ట్‌ంట్స్‌ తమ చిన్నానాటి ఫొటోలను రిక్రియేట్‌ చేశారు. అయితే ఎలిమినేషన్‌ అనేది హౌస్‌లో జరిగే పరిణామాలను బట్టే ఉంటుంది. అయితే ఈ వారంలో బిగ్‌బాస్‌ ముందే చెప్పినట్లు ఏదైనా జరగొచ్చు.! 

చదవండి: బిగ్‌బాస్ : శ్యామల, నూతన్‌ నాయుడు రీఎంట్రీ

బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement