Babu Gogineni
-
‘ఆర్ఆర్ఆర్’ మూవీపై బాబు గోగినేని రివ్యూ, ఏమన్నాడంటే
Babu Gogineni Controversial Comments On RRR Movie: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఆర్ఆర్ఆర్. బాలీవుడ్, టాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన సినీ సెలబ్రెటీలు వరసగా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(మార్చి 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్కు ఫిదా అవుతున్నారు. ఇంతగా నీరాజనాలను అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీపై బిగ్‌బాస్ ఫేం బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: రామ్ చరణ్‌కు సమంత స్పెషల్ బర్త్‌డే విషెస్ ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా మూవీపై తన రివ్యూను ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీపై, జక్కన్నపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా గ్రాండ్‌గా తీశారు. ఈ మూవీతో చరిత్ర సృష్టించేందుకు రాజమౌళి ఎంతో ఎఫర్ట్స్ పెట్టారని అర్థమవుతుంది. అద్భుతమైన నటన, సూపర్ సినిమాటోగ్రాఫి కారణంగానే బలహీనమైన కథకు ఈస్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. హీరోల స్నేహ బంధంలో లాయల్టీ లేదు. సూపర్ మెన్ల స్కిన్ షో తప్ప గుర్తుండిపోయే డైలాగ్ ఒక్కటి లేదు. లోడ్, ఎయిమ్, షూట్ అంతే. కథ చాలా పూర్‌గా ఉంది. మహిళల పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. హాస్యం అసలే లేదు. అంతేకాదు చాలా చోట్ల లాజిక్ కూడా మిస్ అయ్యింది. నాటు నాటు పాట వినోదభరితంగా ఉన్నప్పటికీ, చివర్లో వచ్చిన టైటిల్ సాంగ్‌కు న్యాయం చేయలేదు. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ పాటలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఎదుర్కొన్న సమస్యలను చూపించడంలో విఫలం ఆయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంది. అంతకుమించిన హింస. అందుకే ఈ సినిమాను పెద్దవాళ్లు మాత్రమే చూడండి, చిన్న పిల్లలకు చూపించకండి. ఈ కథలో తీవ్రత ఉంది కానీ పట్టు లేదు. చూస్తుంటే ఈ సినిమా మొత్తాన్ని ఒకే డైరెక్టర్ చేశాడా? అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బాబు గోగినేని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు ఇచ్చిన ఈ రివ్యూపై ఈ నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. జక్కన్నపై అతడు చేసిన వ్యాఖ్యలకు ప్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. pic.twitter.com/9LCFigCvoT — Babu Gogineni (@GogineniBabu) March 27, 2022 -
ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు
ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ మాత్రమే! Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 -
బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు షో నిర్వహణ తీరును తప్పుబట్టడం తెలిసిన సంగతే. బిగ్‌బాస్ సీజన్-3 నుంచి తొలివారంలోనే ఎలిమినేట్ అయిన హేమ కూడా హౌస్‌లో జరిగే అనేక విషయాల్ని బయటకు చూపడం లేదని ఆరోపించారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-2లో బలమైన కంటెస్టెంట్ నిలిచిన బాబు గోగినేని షో నిర్వహణ తీరును ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోతో పాటు పలు ప్రశ్నలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘లీక్‌ల కారణంగా బిగ్‌బాస్ గేమ్ స్పూర్తి దెబ్బతింటుంది. బిగ్‌బాస్ షో నుంచి హేమ ఎలిమినేట్ కావడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంటర్ కావడానికి సంబంధించిన వార్తలు ముందుగానే బయటకు వచ్చాయి. ఈ లీక్‌లు గేమ్ స్పిరిట్‌కు విరుద్దంగా ఉన్నాయి. గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ వార్తలు ప్రచారం చేయడం ఏమిటి?. ఇందులో బిగ్‌బాస్ నిర్వాహకుల తప్పుకూడా ఉంది. హైదరాబాద్ మధ్యలో అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ హౌస్ ఏర్పాటు చేసి.. 400 మంది తెలుగువాళ్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్క గల్లిలో పాట కూడా హౌస్‌లోకి వినిపించేలా ఉన్నప్పుడు.. ఒంటరితనం అనే భావన ఎక్కడున్నట్టు?. బిగ్‌బాస్ కోసం పనిచేసే బృందంలో టెక్నిషియన్లు, ఎడిటర్లు, సౌండ్ ఆపరేటర్స్, డాక్టర్లు, కెమెరామెన్లు.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరి వద్ద నుంచి బయట ఉన్న వ్యక్తులు సమాచారం సేకరించడం చాలా తెలికైన పని. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్లు షూట్ చేసే టెక్నిషియన్లు కొన్ని లీక్‌లను బయటకు వదులుతున్నారు. దీనిని కొన్ని యూట్యూబ్ చానళ్లు తాము ఎదో సాధించామన్నట్టుగా ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇది మంచి పద్దతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. క్రిమినల్, సివిల్ లా ప్రకారం దీనిపై చర్యలు తీసుకోవచ్చు. హౌస్‌లోకి వెళ్లేవారి గురించి, బయటకు వచ్చేవారి గురించి ముందుగానే లీక్‌లు వస్తుంటే నిర్వాహకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. గతంలో కొందరి కంటెస్టెంట్ల పేరిట అభిమానులు ఆర్మీలుగా ఏర్పడి.. ఇతర హౌస్‌మెట్స్‌పై, స్టార్ మాపై, షో నిర్వహకులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి బెదిరింపులు మీరు మళ్లీ ఎదుర్కొవాలని అనుకుంటున్నారా’అని బాబు ప్రశ్నించారు. గత సీజన్లో బాబు ఎలిమినేట్ అయిన సమయంలో కూడా బిగ్‌బాస్ నిర్వహణను తీవ్ర స్థాయిలో విమర్శించారు. -
బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం
-
బిగ్‌బాస్‌లో నా అంచనా తప్పింది : బాబు గోగినేని
బిగ్‌బాస్ హౌజ్‌లోంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన బాబు గోగినేని.. ఆ షోలో జరిగిన సంఘటనలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకొచ్చాక చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటం మామూలే. ఇక గత వారం ఎలిమినేట్ అయిన బాబు గోగినేని బిగ్‌బాస్ హౌజ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్ షోలోకి ఎందుకు వెళ్లారని కొందరు అడుగుతున్నారని.. తనకు నచ్చడం వల్లే షోలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. చివరి వరకు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరు ఉంటారో కూడా అంచనా వేశారు. బిగ్‌బాస్ ఒక పిచ్చివాళ్ల స్వర్గమని అందరూ అంటున్నారని .. అందులో ఉండటం అదో రకమైన అనుభవమంటూ చెప్పుకొచ్చారు. షోలో మొదట్నుంచీ కౌశల్‌తో విబేధించే బాబు.. అతను ఫైనల్ లిస్ట్‌లో ఉండే అవకాశముందని చెప్పుకొచ్చారు. కౌశల్‌కు ఇంటా, బయటా సపోర్ట్ ఉందని.. అతను గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని.. అభిప్రాయపడ్డారు. అయితే మొదటగా తేజస్వీ గెలుస్తుందని అంచనా వేశానని.. కానీ తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని చెప్పారు. దాంతో తన అంచనా తప్పిందని తెలిపారు. కౌశల్ నచ్చలేదు కాబట్టి తనను వ్యతిరేకించానని, అంతేకాని టార్గెట్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత విషయాలను, ఎప్పుడో బయట జరిగిన విషయాలను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రస్తావించడం.. కరెక్ట్ కాదంటూ అందుకే అలా చేశానని చెప్పుకొచ్చారు. ఈ వారం బిగ్‌బాస్ షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. హౌజ్‌మేట్స్ పబ్లిక్ కాలర్స్, బిగ్ బాస్ హౌజ్ కాల్‌సెంటర్‌గా విడిపోయి చేస్తున్న టాస్క్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక ఈ వారం దీప్తి సునయనకు ఎలిమినేషన్ తప్పేట్టు లేదనిపిస్తోంది. చదవండి.. బిగ్‌బాస్ : సునయన ఎలిమినేషన్ తప్పదా? -
బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్
అందరూ అనుకున్నదే జరిగింది.. బిగ్‌బాస్ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అని డిసైడ్ చేసే కౌశల్ ఆర్మీ ఈ సారి బాబును బయటకు పంపేసింది. హౌజ్‌లో అందరితో కలిసి ఉన్నట్లు కనిపించే బాబు.. కౌశల్ విషయం వచ్చేసరికి మాత్రం అమాంతం ఎగిరిపడేవారు. కౌశల్‌తో ఢీ అంటే ఢీ అనేవారు. ఇక ఈ వారం జరిగిన షోలో మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది. అమ్మాయిలకు రావాల్సిన డబ్బును దొంగలించాడని కౌశల్‌ను దొంగ అంటూ నిందించారు. గత వారాలన్నింటిలో కౌశల్‌ను టార్గెట్ చేసిన బాబు గోగినేని .. ఒకానొక దశలో కౌశల్ అయినా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను వెళితే .. కౌశల్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో బిగ్‌బాస్ హోస్ట్ నాని మందలిస్తూ.. ఎవరు ఎవరిని బయటకు పంపలేరని, అది ప్రేక్షకుల చేతిలో ఉందంటూ.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే బాబు హౌజ్ నుంచి బయటకు వెళతారని పలువురు భావించారు. అయితే గతవారం నందిని రాయ్ బయటకు వెళ్లడంతో బాబు గోగినేని ఎలిమినేట్ కావడానికి వారం మాత్రమే ఆలస్యమైంది. ఇక ఎలిమినేషన్ విషయాన్ని పక్కనపెడితే.. ఆదివారం షో ఆద్యంతం వినోదభరితంగా జరిగింది. హౌజ్ మేట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టిన నాని.. వారితో సరదాగా ఆట ఆడించాడు. మధ్యలో నాని కూడా వాళ్లతో కలిసి ఆడాడు. వారి ముందు ఓ రెండు చీటిల డబ్బాను పెట్టారు. ఒక గ్రూపులోని సభ్యుడి వచ్చి దాంట్లోంచి ఒక్కో డబ్బాల్లోంచి ఒక్కో చీటి తీసి అందులో ఉన్న దాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై బొమ్మను గీసి వారి మిగతా సభ్యులతో ఆ చీటిలో వచ్చిందేమిటో చెప్పించాలి. ఇక ఆట పేరు బొమ్మను గీస్తే.. అంటూ నాని ఆటను మొదలుపెట్టారు. ఈ ఆటలో హౌజ్‌మేట్స్ తమ చిత్రకళను ప్రదర్శించారు. ఒక్కొక్కరు సంబంధం లేని చిత్రాలను గీసి ప్రేక్షకులను నవ్వించారు. వారికి వచ్చిన సామెతలకు, సినిమా పేర్లకు వారు గీసిన బొమ్మలకు పొంతన లేకపోయినా.. మిగతా సభ్యులు అతి కష్టం మీద వాటిని గుర్తించారు. ఈ క్రమంలో హౌజ్ అంతా నవ్వులు పూశాయి. కౌశల్‌కు గంగోత్రి అనే చీటి రాగా.. దానికోసం ఏదో ఒక మనిషి బొమ్మ గీసి... నీటి అలలను గీస్తే.. వాటితో అన్ని నదుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి.. చివరకు గంగోత్రి వద్ద ఆగారు. ఇక అమిత్‌కు తెలుగు సరిగా చదవడం రాకపోయే సరికి.. తనకు వచ్చిన చీటికి, గీసిన బొమ్మకు సంబంధం లేకుండాపోయింది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.. అని వస్తే.. చూసి రమ్మంటే కలిసి వచ్చాడు అని పొరపడి తనకు ఇష్టం వచ్చినట్లుగా బొమ్మను గీసేసరికి.. మిగతా సభ్యులు అదెంటో కనిపెట్టలేకపోయారు. ఇక దీప్తి సునయనకు వచ్చిన కాకి పిల్ల కాకికి ముద్దు, ఆవిడా మా ఆవిడే.. లాంటి వాటికి దీప్తి సునయన గీసిన బొమ్మలకు సంబంధం లేకపోయినా.. వాటిని ఎలాగోలా కష్టపడి చెప్పేశారు. ఆవిడా మా ఆవిడే.. అనే దానికి నాని హెల్ప్‌ను కూడా ఆశ్రయించింది. నాని చెప్పిన క్లూతో కాకుండా ఏవో బొమ్మలు వేయగా.. శ్యామల మాత్రమే సరైన సమాధానాన్ని చెప్పగా.. హౌజ్‌మేట్స్‌తో పాటు నాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆస్కార్ ఇవ్వాలంటూ శ్యామలను ఆటపట్టించాడు. బొమ్మరిల్లు, ఇల్లు అలకగానే పండుగ కాదు, మాంగళ్య బలం ఇలా ఇంటరెస్టింగ్‌గా వచ్చిన చీటిలతో హౌజ్‌మేట్స్ చేసిన సందడితో హౌజ్‌తో పాటు ప్రేక్షకులకు కావల్సినంత మజా వచ్చేసింది. ఇక నాని గీసిన హౌజ్‌మేట్స్ బొమ్మలను మాత్రం వారు ఇట్టే గుర్తు పట్టేశారు. పొడుగ్గా బొమ్మను గీయగానే.. అది సామ్రాట్ అని చెప్పేశారు. బట్టతలను గుర్తుగా గీయగా అది అమిత్ అని, స్టైల్‌గా షేవ్ చేసుకున్న బొమ్మను కౌశల్ అని, వెరైటీ హెయిర్‌స్టైల్‌తో గీయగా అది రోల్‌రైడా అని ఇలా ఒక్కొక్కరిని వారి ప్రత్యేకతలను హైలెట్ చేస్తూ నాని బొమ్మలు గీయడంతో సరదాగా సాగిపోయింది. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఎలిమినేషన్‌ను గుర్తు చేశాడు నాని. ఇక హౌజ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కానీ ప్రేక్షకుల్లో మాత్రం అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలిమినేట్ కాబోతున్నది ఎవరో ముందే లీకైపోయింది. ఎప్పటిలాగే ఎలిమినేషన్ కాబోతున్నది ఎవరనేది ముందే బయటకు రావడం ఆనవాయితీగా మారింది. అయినా సరే.. బాబు గోగినేని ఏ మాట్లాడాడు.. ఈ సారి బిగ్‌బాంబ్ ఏంటి? అది ఎవరి మీద వేసి ఉంటాడు? అనేవి కొంత ఆసక్తికరంగా మారాయి. బయటకు వచ్చిన బాబు గోగినేని.. తనకు బిగ్‌బాస్ హౌజ్‌లోకి రావడం గొప్ప అనుభూతి అని.. ఈ ఇంట్లో సరదాగా ఉన్నాను, అల్లరి చేశాను, కోపడ్డాను, నేర్చుకున్నాను... నా కంటే వయసులో చిన్నవాళ్లతో ఇన్ని రోజులు ఇలా గడపడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ హౌజ్‌మేట్స్‌తో మాట్లాడే అవకాశం నాని ఇవ్వగా.. బయటక రండి ఇక్కడ ప్రోమోలను చాలా బాగా వేశారు. తొందరగా వచ్చి మీరు కూడా మీ ప్రోమోలను చూసుకోండి అని సరదాగా అనడంతో హౌజ్‌లోని వారంతా నవ్వుకున్నారు. ఈ వారం అంతా బాత్రూమ్స్ను శుభ్రంగా ఉంచాలనే బిగ్‌బాంబ్‌ను.. సామ్రాట్ పేరు చెబుతూ.. తనకు వద్దులే ఎలాగూ బాగానే చేస్తాడు కాబట్టి.. రోల్‌రైడాకు ఇచ్చేద్దామంటూ.. అతనిపై బిగ్‌బాంబ్ వేశాడు. వారం మొత్తం గుర్తురాని రోల్.. బిగ్‌బాంబ్ అనే సరికి మాత్రం గుర్తొస్తున్నాడంటూ నాని అనగానే హౌజ్‌లో నవ్వులు పూశాయి. ఇక పదో వారం హౌజ్‌లో ఏ జరుగుతుందో వేచి చూడాలి. ఎదైనా జరుగొచ్చు.. ఎందుకంటే బాస్.. ఇది బిగ్‌బాస్! చదవండి... బిగ్‌బాస్: తనీష్ నువ్వెలా బెస్ట్ ప్లేయర్? -
బిగ్‌బాస్: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా?
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ కుట్రలు, కుతంత్రాలు అంటూ పెట్టుకునే గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అయితే ఈ రియాల్టీ షో సాంప్రదాయానికే విరుద్దంగా ఎన్నడూ.. ఎక్కడా లేని విధంగా బిగ్‌బాస్.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు మరో అవకాశం ఇచ్చాడు. అది కూడా ప్రేక్షకుల ఓట్ల ద్వారా అని చెప్పి కావాల్సిన హైప్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రేక్షకులు వారి అభిమాన కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపించడానికి ఓట్లతో పోటీపడ్డారు. దీంతో ఏకంగా ఎన్నడూ లేనివిధంగా 11 కోట్ల పై చిలుకు ఓట్లు నమోదయ్యాయి. ఈ ఓట్లన్ని ఆరుగురు కంటెస్టెంట్స్‌కు రాగా.. మేజార్టీ సాధించిన ఇద్దరికి మాత్రం స్పల్ప తేడా ఉండటంతో ఎవరూ ఊహించని విధంగా ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఆ ఇద్దరికి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ ఇద్దరు కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల అన్న విషయం ముందే తెలిసిపోయినా.. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని రివీల్ చేశాడు. కానీ హౌస్‌లోకి ఎప్పుడు వెళ్లాలనేది మాత్రం బిగ్‌బాస్ నిర్ణయిస్తాడని ప్రకటించాడు. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని మాత్రం చెప్పలేదు. నిజానికి ఏ వారం ఎలిమినేషన్లో కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లే అంశంపై ఈ రోజు ఎపిసోడ్లో స్పష్టత రానుంది. ఇద్దరు ఎంట్రీ.. మరో ఇద్దరు ఔట్! ఏదైనా జరుగొచ్చు అన్నట్లు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు.. అయితే వీరి రాకతో ఈసారి ఎలిమినేషన్లో డబుల్ ధమాకా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఈ విషయంపై నాని కొంత స్పష్టతను ఇచ్చి.. ఇవ్వనట్లు వదిలేశాడు. ఆ మాటలను బట్టి చూస్తే ఈ సారి కచ్చితంగా హౌస్ నుంచి ఇద్దరు నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ రియాల్టీ షో 50 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. ఇంకా మరో 50 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పుజా రామచంద్రన్‌తో కలిపి 12 మంది సభ్యులున్నారు. తాజాగా మరో ఇద్దరు చేరనున్నారు. మొత్తం ఆ సంఖ్య 14కు చేరనుంది. చివరి వారానికి ఐదుగురు మిగులుతారు. ఇలా వారానికి ఒక్కరిని వేసుకున్నా 7గురు మాత్రమే బయటకి పోతారు. కాబట్టి ఈ లెక్కన ఓ రెండు వారాలు ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి.. ఇక సోమవారం ఎపిసోడ్లో గార్డెన్లో ఏర్పాటు చేసిన 1-12 ర్యాంక్స్ బోర్డుల వద్ద కంటెస్టెంట్స్ హౌస్‌లోని తమ ర్యాంకు ఏంటో నిర్ణయించుకోని ఆ ర్యాంకు వద్ద నిలబడాలని, ఒక ర్యాంకు దగ్గర ఒక్కరే నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తనీష్-1, రోల్‌రైడా-2, కౌశల్, దీప్తి-3, సామ్రాట్-4, అమిత్-5, దీప్తీ సునయన-6, గణేశ్-7, బాబుగోగినేని-8, గీతామాధురి-9, నందిని-10, పుజారామచంద్రన్-12 ర్యాంకుల వద్ద నిలబడ్డారు. ఇక తమకు తాము ఎక్కువ ర్యాంకు ఇచ్చుకున్న కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు. కెప్టెన్ అయినందుకు గీతా మాధురి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పుజాలను ఎలిమినేషన్ నుంచి తప్పించాడు. ఇక మూడో ర్యాంకు కోసం గొడవ పడ్డ కౌశల్, దీప్తీలను ఏకాభిప్రాయానికి రానందుకు ఇద్దరినీ బిగ్‌బాస్ నామినేట్ చేశాడు. తను ఎలాగైన నామినేట్ అయ్యేదని, కానీ ఆమెతో కౌశల్‌ను కూడా నామినేషన్లోకి తీసుకొచ్చిందని హౌస్ మేట్స్ పడిపడి నవ్వుకున్నారు. ఈ వారం ఇద్దరైతే..? ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటే బాబుగోగినేని, దీప్తిలకు ఎలిమినేషన్ తప్పేట్టు లేదు. బాబుగోగినేని గత వారం మొత్తం ఆయన ప్రవర్తించిన తీరు ప్రేక్షకుల్లో చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా కౌశల్, గీతా మాధురిలతో ఆయన ప్రవర్తించిన తీరు రాజమౌళీపై కామెంట్స్.. హౌస్‌లోనే కాకుండా టీవీల ముందున్న వారికి చికాకు తెప్పించింది. మరో వైపు ఆయన కేసుల వ్యవహారం కూడా బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు నోటీసులు కూడా అందజేశారు. ఈ పరిస్థితుల్లో ఆయనను హౌస్‌లో కొనసాగించి బిగ్‌బాస్ రిస్క్ తీసుకోలేడని అర్థమవుతోంది. ఇక రెండో వ్యక్తిగా నందినీ, దీప్తీలకు ముప్పు ఉంది. అయితే ఈ ముగ్గురిలో దీప్తీ ఎలిమినేషన్ తప్పెట్టు లేదు. నిజానికి ఆమె భాను శ్రీ సమయంలోనే ఆమె బయటకు వెళ్లాలి.. కానీ పరిస్థితులు అనుకూలించి ఉండిపోయింది. మంచి-చెడు టాస్క్‌లో జరిగిన గొడవ దీప్తీని రెండు వారాలు రక్షించింది. ఆమె ర్యాంకింగ్ టాస్క్‌లో ప్రవర్తించిన తీరు కొంత అభ్యంతరకరంగానే ఉంది. అయితే ఇది ప్రేక్షకులు పాజిటీవ్‌గా? లేక నెగటీవ్‌గా తీసుకుంటారా అన్న విషయంపైనే ఆమె ఎలిమినేషన్ ఆధారపడి ఉంది. ఇక నందినిది కూడా బాబు పరిస్థితే. ఆమె ఒకరి విషయాలు మరొకరి వద్ద ప్రస్తావించడం.. అర్ధరాత్రి తనీష్‌తో రోమాన్స్ చేయడం.. ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అయితే తాజా ఎపిసోడ్ దీప్తీ ప్రవర్తన నందినికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహరంతో కామన్ మ్యాన్ గణేశ్ ఈ వారం బతికిపోయినట్టే. ఇప్పటికే ఈ ఎలిమినేషన్ల వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ముఖ్యంగా బాబుగోగినేని, దీప్తీ, నందినిలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రీక్రియేషన్.. బిగ్‌బాస్ షో మొత్తం కమర్షియల్ అన్న విషయం తెలిసిందే. స్పాన్సర్ బ్రాండ్స్ ప్రచారం కోసమే టాస్క్‌లు సైతం నిర్వహిస్తున్నారు. ఇది తొలి వారంలోనే స్పష్టమైంది. సోమవారం ఎపిసోడ్‌ను సైతం బిగ్‌బాస్ అలానే ప్లాన్ చేశాడు. హౌస్ మేట్స్ బాల్యం ఫొటోలు చూపించి వాటిని రీక్రియేషన్ చేయాలని ఓ టాస్క్ ఇచ్చాడు. దీనికి ఈ షోకు స్పాన్సర్‌గా ఉన్న ఓ కంపెనీ మొబైల్ ఫోన్స్‌ను వాడుకోవాలని సూచించాడు. అయితే హౌస్ మేట్స్ ఫొటోలు కొంత ఆకట్టుకున్నా.. ఈ టాస్క్ పూర్తిగా యాడ్‌లా అనిపించింది. అందరు కంటెస్ట్ంట్స్ తమ చిన్నానాటి ఫొటోలను రిక్రియేట్ చేశారు. అయితే ఎలిమినేషన్ అనేది హౌస్‌లో జరిగే పరిణామాలను బట్టే ఉంటుంది. అయితే ఈ వారంలో బిగ్‌బాస్ ముందే చెప్పినట్లు ఏదైనా జరగొచ్చు.! చదవండి: బిగ్‌బాస్ : శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం -
బిగ్‌బాస్ : బాబు గోగినేనిపై నాని ఫైర్
బిగ్‌బాస్‌లో శుక్రవారం జరిగిన రచ్చే మళ్లీ రిపీటైంది. ఈ వారం జరిగిన కార్యక్రమంపై నాని సమీక్ష జరిపారు. సిల్లీ రీజన్స్‌ను చెప్పి నామినేట్ చేయడంపై సభ్యులను హెచ్చరించాడు. కౌశల్, బాబు గోగినేనిలపై నాని విరుచుకుపడ్డారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ, లగ్జరి బడ్జెట్ అనంతరం జరిగిన పరిణామాలు హైలెట్‌గా నిలిచాయి. ఇవే విషయాలు నాని వచ్చాక కూడా శనివారం జరిగిన షోలో కూడా మల్లి చర్చకు వచ్చాయి. ఈ విషయాలపై నాని ఇంటి సభ్యులందరిని హెచ్చరించాడు. తనీష్‌కు టాస్క్ ఇచ్చిన నాని.. గతవారం కెప్టెన్‌గా చేసిన తనీష్‌కు కంగ్రాట్స్ చెప్పి, కెప్టెన్‌గా ఎలా ఉందంటూ నాని అడిగాడు. అనంతరం మైక్ ధరించడంలో తనీష్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. లాలించడం, బుజ్జగించడం ఆపమంటే.. ఇంకొకరితో స్టార్ట్ చేయమని కాదంటూ నాని మందలించాడు. మైక్ సరిగా ధరించనందుకు ఆదివారం జరిగే షోలో చున్నిని నోటికి చుట్టుకోవాలని ఎవరితో మాట్లాడకూడదంటూ.. ఆదేశించాడు. కౌశల్, దీప్తిల విషయంలో నాని అసహనం చెందారు. లగ్జరి బడ్జెట్ గురించి అడిగాడు కౌశల్ కానీ, బిగ్‌బాస్‌తో స్కిన్ ఎలర్జీ గురించి మాట్లాడతానంటూ చెప్పాడని దీప్తి తెలిపారు. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికైనందుకు గీతా మాధురికి కంగ్రాట్స్ తెలిపాడు. కెప్టెన్సీ టాస్క్ అనంతరం బాబు , గీతల మధ్య జరిగిన గొడవపై నాని బాబు గోగినేనిని మందలించాడు. మీకు దీప్తి గెలవడం ఇష్టం లేదనే విషయమే మాకు అర్థమవుతుందని, అది మీ యాక్షన్స్ వల్ల కనిపించిందని, బయటకు కూడా ఇదే ప్రొజెక్ట్ అయిందని నాని తెలిపాడు. ఇదే విషయం అక్కడ గీతా మాధురి చెబుతూ ఉంటే ఎందుకంతా ఫైర్ అయ్యారని బాబుపై మండిపడ్డాడు. గ్రూపులు కట్టి అందరిని ప్రభావితం చేస్తున్నారంటూ బాబును విమర్శించాడు. ఇక నామినేషన్ విషయంలో కౌశల్, బాబును నాని మందలించాడు. బాబును నామినేట్ చేసిన కారణాలు సరిగా లేవంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో కౌశల్ సమర్దించుకుంటూ.. మూవీ టాస్క్‌లో బాబు గోగినేని తనీష్‌కు ఎక్కువ డబ్బులిచ్చాడని కావాలనే తనకు తక్కువగా ఇచ్చాడని ఇలా చాలా కారణాలున్నాయంటూ, కానీ ఆ రోజు సమయం లేక చెప్పలేదంటూ తెలిపాడు. లాజిక్కుతో ఇరుక్కున్న బాబు రాజమౌళి నాస్తికుడని చెప్పుకుంటూ గుడికి వెళ్లాడని బాబు గతంలో చెప్పాడని.. రాజమౌళిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తనకు నచ్చలేదని అందుకోసమే బాబును కౌశల్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ టాపిక్‌పై నాని మాట్లాడుతూ.. ఆయన నాస్తికుడైనంత మాత్రానా గుడికి వెళ్తే తప్పేంటంటూ నాని ప్రశ్నించాడు. రాజమౌళి తన ఫ్యామిలీ గురించి వెళ్లి ఉండొచ్చు అది ఆయన ఇష్టమంటూ బాబు గోగినేనిపై ఫైర్ అయ్యాడు. తాను చర్చికి కూడా వెళ్తాను అంటూ.. అమ్మమ్మను సంతోష పెట్టడానికి వెళ్తానని తన విషయాన్ని కూడా ప్రస్తావించాడు నాని. కౌశల్, గీతను హౌజ్‌లోంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని చెప్పడంపైనా నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు ఎవరిని బయటకు పంపించలేరని నాని చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం. నాయకుల్ని తయారుచేయడమే నా వృత్తి అంటూ చెప్పుకొచ్చిన బాబుకు.. కానీ నాయకుల్ని చేసేది మేమే.. ప్రజలే నాయకుల్ని చేయగలరు అంటూ నాని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అయితే తాను ఎవరికి బయపడనని, తనకు హౌజ్‌లో ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకుంటే తను సిద్దమే అన్నట్టుగా బాబు గోగినేని తేల్చిచెప్పాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో కుతంత్రం జరుగుతోందిని, కౌశలే గేమ్ ప్లే చేస్తున్నాడంటూ కౌశల్‌పై విరుచుకపడ్డాడు. ప్రబుద్దుడు అంటూ కౌశల్‌ను సంభోదిస్తూ... గతంలో తనకు కౌశల్‌కు మధ్య జరిగిన సంభాషణలు వివరిస్తూ.. సామాన్యుడైన గణేష్‌తో కూడా స్థాయి గురించి మాట్లాడాడని కౌశల్‌పై నిప్పులు చెరిగాడు. ఇక ఈ వారం ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్లేవారెవరో తెలుపకుండా సస్పెన్స్‌లోనే ఉంచాడు. అయితే ఈ వారం ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ హౌజ్‌మేట్స్‌కు నాని తెలిపాడు. అయితే అవి వారి ఎలిమినేషన్‌కు కాదు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భాను శ్రీ, తేజస్వీలను తిరిగి మళ్లీ ఇంటిలోకి పంపించేందుకు బాగానే ఓట్లు పడ్డట్లు నాని తెలిపాడు. అయితే వీరందరిలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. -
బిగ్‌బాస్ : తారాస్థాయికి చేరిన రచ్చ
ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో. చిన్న మాట పెద్ద చర్చకు దారి తీసి రచ్చ రచ్చ అయింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో కౌశల్, దీప్తి, నందిని టీమ్ గెలిచారు. అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఈ సభ్యులకు వచ్చాయి... వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగా.. కౌశల్ మాత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మా టీమ్ గెలిస్తే... ఇంటిలోని ఓ ఇద్దరు సభ్యులు మా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పలేదంటూ వింత సమాధానం చెబుతూ.. ఇంటిలోని అందరు సభ్యులు మంచిగా ఉండాలని అందరం కలిసే లగ్జరి బడ్జెట్ పంచుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో గీత కలగజేసుకుంటూ ఆ ఇద్దరి సభ్యులెవరో చెప్పండి అనగా .. ఒకరు బాబు గోగినేని అని కౌశల్ చెప్పగా.. రెండో వ్యక్తి నేనేనంటూ తనీష్ చెప్పాడు. ఈ తతంగం అంతా జరుగుతుంటే ... బాబు గోగినేని స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ.. నేను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్ వచ్చిన ఐటమ్స్ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్, సామ్రాట్లు తెలిపారు. బాబు గోగినేని నాన్ సెన్స్ పదం వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్సెన్స్ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్ అయ్యారు. తనకు కంగ్రాట్స్ చేయలేదంటూ కౌశల్ అనడంతో మొదలైంది ఈ గొడవ. అయితే తన ఉద్దేశ్యం మాత్రం అందరూ కలిసి ఉండాలని, ఒకరు గెలిచినప్పుడు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెబితే బాగుంటుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. కంగ్రాట్స్ చెప్పలేదు.. కాబట్టి వారికివ్వను.. అని అన్నట్లు ఉందంటూ... ఏదో గీతా మాధురి బలవంతంగా ఒప్పించినట్లు ఉందని అందుకే తనకు లగ్జరి బడ్జెట్‌ను తీసుకోవాలని లేదంటూ.. తనీష్ ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. టాస్క్ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్ వద్దని సామ్రాట్ తెలిపాడు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పుంటే క్షమించమని కౌశల్ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్ ఫైర్ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్ కూడా ఫైర్ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్ అటాక్ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. తనే చేజేతులా చేసుకుంటున్నాడని, అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకోవడం బాలేదని దీప్తి, గీతా మాధురి మాట్లాడుకున్నారు. ఇక కౌశల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి గీతా మాధురి, దీప్తి, రోల్ రైడా, నందిని, పూజలతో మాట్లాడారు. ఇదిలా వుండగా.. ఈ వారం నామినేషన్లో ఉన్న బాబు గోగినేనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్, గీతా మాధురిలను ఎలాగైనా బయటకు పంపించడమే తన ధ్యేయమంటూ ఇంటి సభ్యులతో అంటున్నాడు. ఈ వారం నేను వెళతానేమో.. వెళ్లాక చేసే మొదటి పని కౌశల్‌ను బయటకు పంపడమే, ఆ తరువాత గీతా మాధురిని అంటూ చెప్పుకొచ్చాడు. గత ఎపిసోడ్స్‌లో తనతో పెట్టుకుంటే హౌజ్‌లోంచి బయటకు వెళతారని కౌశల్ అన్నాడని.. అది నిజం కాదంటూ దాన్ని బ్రేక్ చేయడానికి కౌశల్‌తో పెట్టుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: నెక్ట్స్ బాబేనా!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజా లభిస్తోంది. తొలుత కొంత డల్‌గా సాగిన ఈ రియాల్టీ షో సోషల్ మీడియా ట్రోల్స్‌తో వేడెక్కింది. ప్రేక్షకులు కంటెస్టెంట్స్ అభిమానులుగా విడిపోవడంతో నెట్టింట్లో ఈ రియాల్టీ షో గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో హౌస్‌లో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక రసవత్తరంగా సాగిన గురువారం ఎపిసోడ్ ఆకట్టుకుంది. చివర్లో గీతా మాధురి Vs బాబు గోగినేని మధ్య సాగిన చర్చ హైలైట్‌గా నిలిచింది. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోయిన గణేశ్, నందిని, దీప్తి సునయనలకు బిగ్‌బాస్ మరో అవకాశమిచ్చాడు. కానీ దానికి ఓ మెలిక పెట్టడంతో వారు ఒప్పుకోలేదు. అనంతరం ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ టాస్క్ నిర్వహించాడు. ఓ పాన్ షాప్ సెట్‌ను వేసి దానికి యజమానిగా ఇటీవల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణా రామంచంద్రన్‌ను నియమించాడు. హౌస్ మేట్స్ తమ ఆటపాటలతో ఆమెను మెప్పించి కిల్లీలు తీసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్‌లో అపరిచితుడు రాము వేశంలో అమిత్ ఆకట్టుకున్నాడు. ఇక పూజా.. అమిత్, సామ్రాట్, గీతా మాధురి, దీప్తిలు తనను ఆకట్టుకున్నారని బిగ్‌బాస్‌కు సూచించింది. ఈ నలుగురు తదుపరి కెప్టెన్ పోటీదారులుగా ప్రకటిస్తూ.. పెయింట్ వేసుకోని పెడెస్టెల్స్ మీద విగ్రహంలా నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అంతేకాకుండా నచ్చని పోటీదారున్ని కిందికి దిగేలా ఏమైనా చేయవచ్చని మిగతా సభ్యులుకు సూచించాడు. కౌశల్ Vs తనీష్.. కెప్టెన్ పోటీదారులను ఇతర సభ్యులు తమ తోచిని రీతిలో ఇబ్బంది పెట్టసాగారు. ఈ సందర్భంగా కౌశల్, తనీష్ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కౌశల్ కొబ్బరి నూనేను వారిపై పోస్తుండగా నందిని రాయ్, తనీష్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన ఒక్కడిపైనే పసుపు కొట్టారని, తాను కేవలం కొబ్బరి నూనెను ఎవరికి మద్దతివ్వకుండా అందరిపై పోస్తున్నానని, కౌశల్ పేర్కొన్నాడు. దీంతో తనీష్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అనంతరం అమిత్, సామ్రాట్‌లను నెట్టేద్దామని పూజా, కౌశల్ చర్చించుకున్నారు. కానీ అప్పటికే బాబుగోగినేని బకెట్‌తో దీప్తిని దించేశాడు. ఆ వెంటనే కౌశల్ స్టిక్‌తో అమిత్, సామ్రాట్‌లను నెట్టేయడంతో గీతా మాధురి ఒక్కరు మిగిలిపోయారు. దీంతో గీతా మాధురినే తదుపరి కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించాడు. గేమ్ ఆడిన కౌశల్.. తన సహజ శైలితో హౌస్‌లో ఒంటరి వాడైన కౌశల్ అసలు సిసలు గేమ్ ఆడాడు. ముఖ్యంగా పీకలదాక తన మీద కోపం పెంచుకున్న బాబుగోగినేని వ్యూహంపై దెబ్బకొట్టాడు. అంతో ఇంతో హౌజ్‌లో చనువుగా ఉండే గీతా మాధురి, దీప్తిలను కెప్టెన్ కాకుండా అడ్డుకోవాలనే బాబు, తనీష్, సామ్రాట్ల ప్లాన్‌ను విజయవంతంగా అడ్డుకున్నాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న బాబు దీప్తిని కిందపడేసి.. అనంతరం గీతా మాధురిని తోసేయాలనుకున్నాడు. దీంతో అమిత్, సామ్రాట్‌లో ఎవరు కెప్టెన్ అయినా తన మాట చెల్లుతుందని భావించాడు. కానీ కౌశల్ ఈ వ్యూహాన్ని అడ్డుకున్నాడు. బాబు VS గీతా మాధురి.. తన ప్లాన్ విఫలమవడంతో బాబు గోగినేని ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్ గీతా మాధురితో తగువు పెట్టుకున్నాడు. దీప్తి, సామ్రాట్‌లలో ఒకరిని కెప్టెన్ చేద్దామనుకున్నాం.. అంత గొడవ జరుగుతున్నా మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని గీతాను ప్రశ్నించాడు. దీప్తిని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు కిందపడేశారని ఆమె ప్రశ్నించడంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘మీరు కెప్టెన్‌గా హౌస్‌కు నాయకత్వం వహించాలి. కూర్చొని గ్రూప్‌లు చేయకండి’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘డిస్కషన్లో నిజాయితీ లేని మీతో నేను చర్చ జరపను. ఆకతాయి మాటలతో ఎదుటి వారి ఉద్దేశాలు మాట్లాడటానికి వీల్లేదు’ అని మండిపడ్డాడు. ‘నాకు మాట్లాడాలని లేకపోయిన మీ వయస్సుకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నానంటూ’ గీతా కౌంటర్ ఇచ్చింది. కెప్టెన్సీ మొదట్లోనే గ్రూప్‌తో మొదలు పెట్టారని.. ఎలా కొనసాగిస్తారో చూస్తానని, మీ ఉద్యోగం మీరు చేసుకుంటే మంచిదని సూచించాడు. దీనికి గీతా సైతం తన బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాని, మీకు నచ్చకపోతే నామినేట్ చేయండి అంటూ బదులిచ్చింది. వీరి సంభాషణలో కౌశల్ తల దూర్చగా.. సామ్రాట్, తనీష్‌లు వాళ్లిద్దరిని మాట్లాడుకోనివ్వండి అంటూ సూచనలిచ్చారు. బాబుపై నెటిజన్ల ఫైర్.. ఎలిమినేషన్లో నామినేట్ అయినప్పటి నుంచి.. ముఖ్యంగా కౌశల్ రాజమౌళి విషయం ప్రస్తావించడంతో బాబు గోగినేని తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనపడుతోంది. తనే బిగ్గర్ బాస్‌నని చెప్పుకునే బాబు.. హుందాగా వ్యవహరించడం లేదని, ఇగోయిస్ట్‌గా ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకున్నా.. వచ్చే వారం బాబు హౌస్ వీడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్ని రోజులు బాబుపై ఎంతో గౌరవం ఉండేది.. కానీ ఈ చర్యతో అది పోయింది’ అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోలో గీతా మాధురి కన్నీటి పర్యంతమైంది. ఆమెను తనీష్ ఓదార్చాడు.. మరో వైపు బాబు గోగినేని మాత్రం ఈ వారం తాను ఎలిమినేట్ అయితే.. కౌశల్, గీతా మాధురిలను బయటకు వచ్చేలా చేయడం తన పనిగా పెట్టుకుంటానని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్లో ఎం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది. చదవండి: బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం -
బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆయనకు నోటీసులు జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. నేడో, రేపో బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో నిర్వాహకుల చేతికి నగరంలోని మాదాపూర్ పోలీసులు అందుకు సంబంధించిన నోటీసులు అందజేయనున్నారు. నోటీసులు అందుకున్నాక వివరణ ఇచ్చుకునేందుకు 48 గంటలు సమయం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇటీవల బాబు గోగినేనిపై కేసు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈనెల 25వ తేదీలోగా బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. బాబు గోగినేనిపై గత నెలలో తీవ్రమైన నేరారోపణలతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని పిటిషనర్ కేవీ నారాయణ తన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు. దీంతో దేశ ద్రోహం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు, ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
బిగ్‌బాస్ : అడ్డంగా బుక్కైన బాబు గోగినేని
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు అన్నట్లే హౌస్‌లో ఏదేదో జరుగుతోంది. మొత్తానికి ప్రేక్షకులకు కావాల్సిన మజా అయితే లభిస్తోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాని రెట్టించిన ఉత్సాహంతో అలరించాడు. వస్తూ వస్తూనే తనదైన పిట్టకథతో మొదలు పెట్టిన నాని.. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకున్నాడు. సగటు ప్రేక్షకుడి అభిప్రాయాన్ని హోస్ట్‌గా వారి ముందుంచాడు. కొద్దీ సేపు సీరియస్‌గా.. మరికొంత సేపు జాలీగా శనివారం ఎపిసోడంతా ఆసక్తికరంగా సాగింది. హౌస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన కౌశల్‌ను అభినందిస్తూ.. ఎలిమినేషన్ ప్రక్రియ, టాస్క్‌లు, హౌస్ మేట్స్ మధ్య గొడవలపైనే నాని ఆరా తీశాడు. ముఖ్యంగా తనకు తాను బాస్‌గా ఫీలయ్యే బాబుగోగినేని ఓ విషయంలో నాని ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతరులనే ప్రభావితం చేయగల బాబు గోగినేనే తేజస్వీ మాటలకు ప్రభావితమవుతున్నారని నాని అభిప్రాయపడ్డాడు. ఆమె మాటలతోనే ఆయన దీప్తిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారని చెప్పాడు. ‘ బాబు గారు మీరు దేవుడిని నమ్మరు. కేవలం సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి, ప్రభావితమై ఎలా నామినేట్ చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ఆయన సరైన సమాధానం చెప్పలేక, టాపిక్ డైవర్ట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇక తేజస్వీకి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు నాని. తను మొదటిలా ఉండటంలేదని, చాలా మార్పు వచ్చిందని, తను ఇబ్బంది పడటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఓ నలుగురిని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా కౌశల్ విషయంలో ఏదో పెట్టుకుని ప్రవర్తిస్తోందని, అది మంచిది కాదని సూచించాడు. సామ్రాట్‌తో ఉన్న స్నేహం గురించి హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లు గుసగుసలాడటం.. దానికి ఆమె ఇతరులతో డిబేట్ పెట్టడం సరికాదని, ఓ హౌస్‌లో ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడంలో తప్పులేదని అందరికి గట్టిగానే చెప్పాడు. షాక్ అయిన కౌశల్ .. కెప్టెన్ అయినందుకు సంతోషంగా ఉందని, హౌస్ మేట్స్ చాలా సహకారం అందిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలంటూ నానికి చెప్పాడు. అయితే కంటెస్టెంట్లు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అంటూ ఓ వీడియో చూపించాడు. ఆ వీడియోలో.. కౌశల్ మైక్ సరిగ్గా ధరించమని బిగ్‌బాస్ అనౌన్స్మెంట్ రాగానే వారంతా.. బాగైంది అంటూ ఎగిరి గంతేశారు. ఇక హౌస్ క్లీనింగ్‌లో కౌశల్ స్టిక్ట్‌గా వ్యవహరించడంతో అతనిపై బాబుగోగినేని, తేజస్వీ, భానులు జోక్స్ వేస్తూ విమర్శించారు. ఇదంతా చూసిన కౌశల్ ఆశ్చర్యపోయాడు. అందరూ నా ముందు బాగా మాట్లాడుతూ..కౌగిలించుకుంటూ.. తనతో మంచిగా మెలుగుతున్నారని, కానీ వెనుక ఇలా చేస్తున్నారని తెలియదన్నాడు. ఇలా స్టిక్ట్‌గా ఉండటం తన తత్వమని, తన వెనుకాల మాట్లాడే మాటలను పట్టించుకోనన్నాడు. అసలు తొలి రోజు నుంచి తనని ఎందుకు కార్నర్ చేస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోతో మరోసారి బాబు గోగినేని బుక్కయ్యాడు. కౌశల్‌కు సన్నిహితంగా ఉంటూనే, అతనిపై జోక్స్ వేయడం, వ్యతిరేకంగా మాట్లాడటం కనిపించింది. ఎలిమినేషన్ స్టార్ సేఫ్.. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతున్న గణేశ్ తొలిసారి అందరి కన్నా ముందే ప్రొటెక్ట్ అయ్యాడు. ఓ కామన్ మ్యాన్ హౌస్‌లో ఉండాలనే ప్రేక్షకులు అతనికి భారీ మధ్దతు తెలియజేస్తున్నారు. దీంతోనే అతను నాలుగు వారాలుగా సేఫ్ అవుతున్నాడు. ఇక ప్రతీసారి గణేశ్‌ను నామినేట్ చేస్తూ.. ‘అతను తీవ్ర మనోవేదన గురవుతున్నాడు.. అతని వల్ల కావడంలేదు’.. అని సొళ్లు కబుర్లు చెబితే బాగుండదని, హౌస్ మేట్స్ అందరిని నాని హెచ్చరించాడు. ఇది నాని మాటే కాదు.. టీవీల ముందు చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడి అభిప్రాయం కూడా అదే. కావాలనే గణేశ్‌ను నామినేట్ చేస్తూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇది గ్రహించిన ప్రేక్షకులు అతనికి ఓట్ల ద్వారా మద్దతు తెలుపుతున్నారు. ఇక గణేశ్‌కు సమస్య హౌస్ మేట్సేనని నాని గ్రహించాడు. అతని బాధను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాడని, ఎవరూ అవకాశం ఇవ్వడం లేదన్నాడు. ఏదైన బాధ ఉంటే అన్నలాంటోడిని .. ప్రతి శనివారం వస్తానని తనకు చెప్పాలని గణేశ్‌కు సూచించాడు. గణేశ్‌తో పాటు సింగర్ గీతా మాధురి సైతం ప్రొటెక్ట్ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ లిస్ట్‌లో కెప్టెన్ కౌశల్, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్, దీప్తీలు మిగిలారు. -
ఈ కేసుల వెనుక మతోన్మాద మాఫియా..
పంజగుట్ట: ప్రజలను మతం, మూఢనమ్మకాల పేరుతో దగాచేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న బాగు గోగినేనిపై దేశద్రోహం కేసు పెట్టడం హేతువాద గొంతుకని నొక్కడమేనని పలువురు హేతువాదులు విమర్శించారు. ఆయనపై చేసిన ఆరోపణలు, బనాయించిన కేసులు ఏవీ చట్టంముందు నిలబడే స్థాయిలో లేవన్నారు. బాబు గోగినేని ‘బిగ్‌బాస్–2’ లో ఉన్నందున అతను ఎవ్వరికీ అందుబాటులో లేడని, అతను బయటకు వచ్చాక కేసుకు పూర్తిగా సహకరిస్తారని, అతనిపై అన్ని నిరాధార ఆరోపణలు చేశారని రుజువు చేస్తారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి మాదివాడ రామబ్రహ్మం, వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్‌రెడ్డి, నటుడు కత్తి మహేష్, న్యాయవాదులు గాంధీ, జువ్వూరి సుధీర్ మాట్లాడారు. వీరనారాయణ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా బాబుపై కేసు వేశారని, కోర్టు ఆదేశాలతో మాదాపూర్ పోలీసులు అతనిపై రాజద్రోహం, దేశద్రోహం, నమ్మకద్రోహం, మోసం, మతాల మధ్య వ్యతిరేకతను రెచ్చగొట్టడం లాంటి కేసులు బనాయించారన్నారు. సీఆర్పీసీ 41 ప్రకారం నేరం మోపబడిన వ్యక్తి వివరణ తీసుకుని నేరం జరిగిందని తేలితేనే కేసు నమోదు చేయాలన్నారు. ఈ కేసుల వెనుక మతోన్మాద వ్యాపార మాఫియా ఉందన్నారు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక బాబు పోలీసులకు పూర్తిగా సహకరించి కేసు నుంచి బయటపడతారని తెలిపారు. -
బాబు గోగినేనిపై కేసు కక్ష వేధింపు చర్యే
-
హేతువాది బాబు గోగినేనిపై కేసు నమోదు
-
బాబు గోగినేనిపై కేసు నమోదు..
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై కేసు నమోదు అయ్యింది. కేవీ నారాయణ, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై దేశ ద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు బాబు గోగినేని ఫౌండర్‌గా ఉన్నారని, ఈ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు మలేషియాలో నిర్వహిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొనే వారి నుంచి బాబు గోగినేని, అతని అనుచరులు ఆధార్ నంబర్ తీసుకోవడమే కాకుండా.. ఆధార్ నంబర్లను నెట్లో పెట్టారని మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు. -
ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది
కడియం (రాజమహేంద్రవరం రూరల్): ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, ఆ హక్కును హరించడం సరికాదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. బాబు గోగినేని ఫేస్బుక్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన స్థానిక పల్ల వెంకన్న నర్సరీకి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ అభిమానులు తనపై అన్ని రకాల దాడులకూ దిగారని, అయినా తాను వెనకడుగు వేయలేదని చెప్పారు. అభిమానులకు పవన్ సూచనలు ఇచ్చినందువల్లే వివాదం సద్దుమణిగిందని తెలిపారు. పండుగల సమయంలో ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే చంద్రన్న కానుకల వంటివి దండగని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా మానవతావాదులుగా ఉండేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. -
ఆడ దెయ్యం కోసం శ్మశానంలో వేట
నిర్మల్ : ఊళ్లోని పురుషులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఊర్లో ఆడ దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. భయంతో కాశీగూడ గ్రామంలోని 100 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో కాశీగూడ గ్రామం ఉంది. ఆడ దెయ్యం మగాళ్లను చంపుతోందనే మూఢనమ్మకాన్ని పొగొట్టేందుకు గ్రామంలోని శ్మశానవాటికలో 'దెయ్యంతో సెల్ఫీకి ప్రయత్నం' అనే కార్యక్రమానికి హేతువాద బృందం శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఈ తంతు మొత్తాన్ని సోషల్‌మీడియాలో లైవ్‌గా చూపించింది బృందం. ఈ హేతువాద బృందానికి ఫేస్బుక్లో ఓ గ్రూప్ కూడా ఉంది. అందులోని సభ్యలు అందరూ కలిసే 'దెయ్యంతో సెల్ఫీకి ప్రయత్నం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ హేతువాది బాబు గోగినేని, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, మరికొందరు హేతువాదులు కాశీగూడకు వెళ్లారు. శనివారం రాత్రి శ్మశానం, దెయ్యం తిరుగుతోందని గ్రామస్థులు చెబుతున్న ప్రదేశాల్లో కలియతిరిగారు. దెయ్యంతో సెల్ఫీ' కార్యక్రమంపై బాబు గోగినేని మాట్లాడుతూ ''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అన్నారు.