బిగ్‌బాస్‌ : బాబు గోగినేనిపై నాని ఫైర్‌ | Bigg Boss 2 Telugu Nani Fires On Babu Gogineni | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 1:05 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Nani Fires On Babu Gogineni - Sakshi

బిగ్‌బాస్‌లో శుక్రవారం జరిగిన రచ్చే మళ్లీ రిపీటైంది. ఈ వారం జరిగిన కార్యక్రమంపై నాని సమీక్ష జరిపారు. సిల్లీ రీజన్స్‌ను చెప్పి నామినేట్‌ చేయడంపై సభ్యులను హెచ్చరించాడు. కౌశల్‌, బాబు గోగినేనిలపై నాని విరుచుకుపడ్డారు. ఇక ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ, లగ్జరి బడ్జెట్‌ అనంతరం జరిగిన పరిణామాలు హైలెట్‌గా నిలిచాయి. ఇవే విషయాలు నాని వచ్చాక కూడా శనివారం జరిగిన షోలో కూడా మల్లి చర్చకు వచ్చాయి. ఈ విషయాలపై నాని ఇంటి సభ్యులందరిని హెచ్చరించాడు. 

తనీష్‌కు టాస్క్‌ ఇచ్చిన నాని..
గతవారం కెప్టెన్‌గా చేసిన తనీష్‌కు కంగ్రాట్స్‌ చెప్పి, కెప్టెన్‌గా ఎలా ఉందంటూ నాని అడిగాడు. అనంతరం మైక్‌ ధరించడంలో తనీష్‌ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. లాలించడం, బుజ్జగించడం ఆపమంటే.. ఇంకొకరితో స్టార్ట్‌ చేయమని కాదంటూ నాని మందలించాడు. మైక్‌ సరిగా ధరించనందుకు ఆదివారం జరిగే షోలో చున్నిని నోటికి చుట్టుకోవాలని ఎవరితో మాట్లాడకూడదంటూ.. ఆదేశించాడు.

కౌశల్‌, దీప్తిల విషయంలో నాని అసహనం చెందారు. లగ్జరి బడ్జెట్‌ గురించి అడిగాడు కౌశల్‌ కానీ, బిగ్‌బాస్‌తో స్కిన్‌ ఎలర్జీ గురించి మాట్లాడతానంటూ చెప్పాడని దీప్తి తెలిపారు. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికైనందుకు గీతా మాధురికి కంగ్రాట్స్‌ తెలిపాడు. కెప్టెన్సీ టాస్క్‌ అనంతరం బాబు , గీతల మధ్య జరిగిన గొడవపై నాని బాబు గోగినేనిని మందలించాడు. మీకు దీప్తి గెలవడం ఇష్టం లేదనే విషయమే మాకు అర్థమవుతుందని, అది మీ యాక్షన్స్‌ వల్ల కనిపించిందని, బయటకు కూడా ఇదే ప్రొజెక్ట్‌ అయిందని నాని తెలిపాడు. ఇదే విషయం అక్కడ గీతా మాధురి చెబుతూ ఉంటే ఎందుకంతా ఫైర్‌ అయ్యారని బాబుపై మండిపడ్డాడు. 

గ్రూపులు కట్టి అందరిని ప్రభావితం చేస్తున్నారంటూ బాబును విమర్శించాడు. ఇక నామినేషన్‌ విషయంలో కౌశల్‌, బాబును నాని మందలించాడు. బాబును నామినేట్‌ చేసిన కారణాలు సరిగా లేవంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో కౌశల్‌ సమర్దించుకుంటూ.. మూవీ టాస్క్‌లో బాబు గోగినేని  తనీష్‌కు ఎక్కువ డబ్బులిచ్చాడని కావాలనే తనకు తక్కువగా ఇచ్చాడని ఇలా చాలా కారణాలున్నాయంటూ, కానీ ఆ రోజు సమయం లేక చెప్పలేదంటూ తెలిపాడు. 

లాజిక్కుతో ఇరుక్కున్న బాబు
రాజమౌళి నాస్తికుడని చెప్పుకుంటూ గుడికి వెళ్లాడని బాబు గతంలో చెప్పాడని.. రాజమౌళిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తనకు నచ్చలేదని అందుకోసమే బాబును కౌశల్‌ నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ టాపిక్‌పై నాని మాట్లాడుతూ.. ఆయన నాస్తికుడైనంత మాత్రానా గుడికి వెళ్తే తప్పేంటంటూ నాని ప్రశ్నించాడు. రాజమౌళి తన ఫ్యామిలీ గురించి వెళ్లి ఉండొచ్చు అది ఆయన ఇష్టమంటూ బాబు గోగినేనిపై ఫైర్‌ అయ్యాడు. తాను చర్చికి కూడా వెళ్తాను అంటూ..  అమ్మమ్మను సంతోష పెట్టడానికి వెళ్తానని తన విషయాన్ని కూడా ప్రస్తావించాడు నాని.

కౌశల్‌, గీతను హౌజ్‌లోంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని చెప్పడంపైనా నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు ఎవరిని బయటకు పంపించలేరని నాని చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం. నాయకుల్ని తయారుచేయడమే నా వృత్తి అంటూ చెప్పుకొచ్చిన బాబుకు.. కానీ నాయకుల్ని చేసేది మేమే.. ప్రజలే నాయకుల్ని చేయగలరు అంటూ నాని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. 

అయితే తాను ఎవరికి బయపడనని, తనకు హౌజ్‌లో ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకుంటే తను సిద్దమే అన్నట్టుగా బాబు గోగినేని తేల్చిచెప్పాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో కుతంత్రం జరుగుతోందిని, కౌశలే గేమ్‌ ప్లే చేస్తున్నాడంటూ కౌశల్‌పై విరుచుకపడ్డాడు. ప్రబుద్దుడు అంటూ కౌశల్‌ను సంభోదిస్తూ... గతంలో తనకు కౌశల్‌కు మధ్య జరిగిన సంభాషణలు వివరిస్తూ.. సామాన్యుడైన గణేష్‌తో కూడా స్థాయి గురించి మాట్లాడాడని కౌశల్‌పై నిప్పులు చెరిగాడు. 

ఇక ఈ వారం ప్రొటెక్షన్‌ జోన్‌లోకి వెళ్లేవారెవరో తెలుపకుండా సస్పెన్స్‌లోనే ఉంచాడు. అయితే ఈ వారం ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ హౌజ్‌మేట్స్‌కు నాని తెలిపాడు. అయితే అవి వారి ఎలిమినేషన్‌కు కాదు. ఇప్పటివరకు ఎలిమినేట్‌ అయిన సంజన, నూతన్‌ నాయుడు, కిరీటి, శ్యామల, భాను శ్రీ, తేజస్వీలను తిరిగి మళ్లీ ఇంటిలోకి పంపించేందుకు బాగానే ఓట్లు పడ్డట్లు నాని తెలిపాడు. అయితే వీరందరిలో బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement