సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు అన్నట్లే హౌస్‌లో ఏదేదో జరుగుతోంది. మొత్తానికి ప్రేక్షకులకు కావాల్సిన మజా అయితే లభిస్తోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాని రెట్టించిన ఉత్సాహంతో అలరించాడు. వస్తూ వస్తూనే తనదైన పిట్టకథతో మొదలు పెట్టిన నాని.. కంటెస్టెంట్‌లను ఓ ఆట ఆడుకున్నాడు. సగటు ప్రేక్షకుడి అభిప్రాయాన్ని హోస్ట్‌గా వారి ముందుంచాడు. కొద్దీ సేపు సీరియస్‌గా.. మరికొంత సేపు జాలీగా శనివారం ఎపిసోడంతా ఆసక్తికరంగా సాగింది. హౌస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన కౌశల్‌ను అభినందిస్తూ.. ఎలిమినేషన్ ప్రక్రియ, టాస్క్‌లు, హౌస్ మేట్స్ మధ్య గొడవలపైనే నాని ఆరా తీశాడు.
ముఖ్యంగా తనకు తాను బాస్‌గా ఫీలయ్యే బాబుగోగినేని ఓ విషయంలో నాని ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతరులనే ప్రభావితం చేయగల బాబు గోగినేనే తేజస్వీ మాటలకు ప్రభావితమవుతున్నారని నాని అభిప్రాయపడ్డాడు. ఆమె మాటలతోనే ఆయన దీప్తిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారని చెప్పాడు. ‘ బాబు గారు మీరు దేవుడిని నమ్మరు. కేవలం సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి, ప్రభావితమై ఎలా నామినేట్ చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ఆయన సరైన సమాధానం చెప్పలేక, టాపిక్ డైవర్ట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
ఇక తేజస్వీకి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు నాని. తను మొదటిలా ఉండటంలేదని, చాలా మార్పు వచ్చిందని, తను ఇబ్బంది పడటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఓ నలుగురిని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా కౌశల్ విషయంలో ఏదో పెట్టుకుని ప్రవర్తిస్తోందని, అది మంచిది కాదని సూచించాడు. సామ్రాట్‌తో ఉన్న స్నేహం గురించి హౌస్‌లో ఇతర కంటెస్టెంట్‌లు గుసగుసలాడటం.. దానికి ఆమె ఇతరులతో డిబేట్ పెట్టడం సరికాదని, ఓ హౌస్‌లో ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడంలో తప్పులేదని అందరికి గట్టిగానే చెప్పాడు.
షాక్ అయిన కౌశల్ ..
కెప్టెన్ అయినందుకు సంతోషంగా ఉందని, హౌస్ మేట్స్ చాలా సహకారం అందిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలంటూ నానికి చెప్పాడు. అయితే కంటెస్టెంట్‌లు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అంటూ ఓ వీడియో చూపించాడు. ఆ వీడియోలో.. కౌశల్ మైక్ సరిగ్గా ధరించమని బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ రాగానే వారంతా.. బాగైంది అంటూ ఎగిరి గంతేశారు. ఇక హౌస్ క్లీనింగ్‌లో కౌశల్ స్టిక్ట్‌గా వ్యవహరించడంతో అతనిపై బాబుగోగినేని, తేజస్వీ, భానులు జోక్స్ వేస్తూ విమర్శించారు. ఇదంతా చూసిన కౌశల్ ఆశ్చర్యపోయాడు. అందరూ నా ముందు బాగా మాట్లాడుతూ..కౌగిలించుకుంటూ.. తనతో మంచిగా మెలుగుతున్నారని, కానీ వెనుక ఇలా చేస్తున్నారని తెలియదన్నాడు. ఇలా స్టిక్ట్‌గా ఉండటం తన తత్వమని, తన వెనుకాల మాట్లాడే మాటలను పట్టించుకోనన్నాడు. అసలు తొలి రోజు నుంచి తనని ఎందుకు కార్నర్ చేస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోతో మరోసారి బాబు గోగినేని బుక్కయ్యాడు. కౌశల్‌కు సన్నిహితంగా ఉంటూనే, అతనిపై జోక్స్ వేయడం, వ్యతిరేకంగా మాట్లాడటం కనిపించింది.
ఎలిమినేషన్ స్టార్ సేఫ్..
హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతున్న గణేశ్ తొలిసారి అందరి కన్నా ముందే ప్రొటెక్ట్ అయ్యాడు. ఓ కామన్ మ్యాన్ హౌస్‌లో ఉండాలనే ప్రేక్షకులు అతనికి భారీ మధ్దతు తెలియజేస్తున్నారు. దీంతోనే అతను నాలుగు వారాలుగా సేఫ్ అవుతున్నాడు. ఇక ప్రతీసారి గణేశ్‌ను నామినేట్ చేస్తూ.. ‘అతను తీవ్ర మనోవేదన గురవుతున్నాడు.. అతని వల్ల కావడంలేదు’.. అని సొళ్లు కబుర్లు చెబితే బాగుండదని, హౌస్ మేట్స్ అందరిని నాని హెచ్చరించాడు. ఇది నాని మాటే కాదు.. టీవీల ముందు చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడి అభిప్రాయం కూడా అదే. కావాలనే గణేశ్‌ను నామినేట్ చేస్తూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇది గ్రహించిన ప్రేక్షకులు అతనికి ఓట్ల ద్వారా మద్దతు తెలుపుతున్నారు. ఇక గణేశ్‌కు సమస్య హౌస్ మేట్సేనని నాని గ్రహించాడు. అతని బాధను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాడని, ఎవరూ అవకాశం ఇవ్వడం లేదన్నాడు. ఏదైన బాధ ఉంటే అన్నలాంటోడిని .. ప్రతి శనివారం వస్తానని తనకు చెప్పాలని గణేశ్‌కు సూచించాడు. గణేశ్‌తో పాటు సింగర్ గీతా మాధురి సైతం ప్రొటెక్ట్ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ లిస్ట్‌లో కెప్టెన్ కౌశల్, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్, దీప్తీలు మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment