Babu Gogineni Controversial Review On SS Rajamouli's RRR Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Babu Gogineni RRR Review: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై గోగినేని రివ్యూ, జక్కన్నపై సంచలన వ్యాఖ్యలు

Published Sun, Mar 27 2022 6:07 PM | Last Updated on Mon, Mar 28 2022 9:34 AM

Babu Gogineni Controversial Review On RRR Movie, SS Rajamouli - Sakshi

Babu Gogineni Controversial Comments On RRR Movie: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఆర్‌ఆర్‌ఆర్‌. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సౌత్‌ ఇండస్ట్రీలకు చెందిన సినీ సెలబ్రెటీలు వరసగా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(మార్చి 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా‏ ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్‌కు ఫిదా అవుతున్నారు. ఇంతగా నీరాజనాలను అందుకుంటున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై బిగ్‌బాస్‌ ఫేం బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: రామ్‌ చరణ్‌కు సమంత స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా మూవీపై తన రివ్యూను ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీపై, జక్కన్నపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘రాజమౌళి గారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చాలా గ్రాండ్‌గా తీశారు. ఈ మూవీతో చరిత్ర సృష్టించేందుకు రాజమౌళి ఎంతో ఎఫర్ట్స్‌ పెట్టారని అర్థమవుతుంది. అద్భుతమైన నటన, సూపర్‌ సినిమాటోగ్రాఫి కారణంగానే బలహీనమైన కథకు ఈస్థాయిలో రెస్పాన్స్‌ వస్తుంది. హీరోల స్నేహ బంధంలో లాయల్టీ లేదు. సూపర్‌ మెన్‌ల స్కిన్‌ షో తప్ప గుర్తుండిపోయే డైలాగ్‌ ఒక్కటి లేదు. లోడ్, ఎయిమ్, షూట్ అంతే. కథ చాలా పూర్‌గా ఉంది. మహిళల పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. హాస్యం అసలే లేదు. అంతేకాదు చాలా చోట్ల లాజిక్ కూడా మిస్ అయ్యింది. నాటు నాటు పాట వినోదభరితంగా ఉన్నప్పటికీ, చివర్లో వచ్చిన టైటిల్‌ సాంగ్‌కు న్యాయం చేయలేదు. 

చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ఈ పాటలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఎదుర్కొన్న సమస్యలను చూపించడంలో విఫలం ఆయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంది. అంతకుమించిన హింస. అందుకే ఈ సినిమాను పెద్దవాళ్లు మాత్రమే చూడండి, చిన్న పిల్లలకు చూపించకండి. ఈ కథలో తీవ్రత ఉంది కానీ పట్టు లేదు. చూస్తుంటే ఈ సినిమా మొత్తాన్ని ఒకే డైరెక్టర్‌ చేశాడా? అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బాబు గోగినేని చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు ఇచ్చిన ఈ రివ్యూపై ఈ నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. జక్కన్నపై అతడు చేసిన వ్యాఖ్యలకు ప్యాన్స్‌ మండిపడుతున్నారు. దీంతో ఆయనను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement