బిగ్‌బాస్‌ : ఆ కార్డే కౌశల్‌ కొంప ముంచుతుందా? | IS Bigg Boss Offer Is Effect For Kaushal | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 3 2018 5:11 PM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

IS Bigg Boss Offer Is Effect For Kaushal - Sakshi

కౌశల్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ ఏదైనా జరగొచ్చు.. అన్నట్లుగానే హౌస్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య ఏదేదో జరుగుతోంది. మొత్తానికి అభిమానులకు కావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అయితే అందుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య గాసిప్స్‌.. తేజస్వీ-సామ్రాట్‌, తనీష్‌-దీప్తి సునయనాల వ్యవహారం.. హౌస్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇదే అదునుగా భావించిన బిగ్‌బాస్‌ సైతం అమిత్‌, తనీష్‌లకు ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. దీనికి తనీష్.. అమిత్‌ సాయంతో తనకు దీప్తిసునయనాల మధ్య ఉన్న వ్యవహారంపైనే ఓ కథ అల్లి రక్తికట్టించాడు. అయితే వీరిదంతా కట్టుకథా అని సింగర్‌ గీతా మాధురి కొట్టిపారేసింది. అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌ మరోసారి చర్చనీయాంశమైంది. తనీష్, సామ్రాట్‌, అమిత్‌, భానుశ్రీ, కెప్టెన్‌ రోల్‌రైడాలు మినహా అందరూ ఈ సారి ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు.

అయితే ఈ సారి బిగ్‌బాస్‌ ఇద్దరిద్దరిని పిలిచి ఏకాభిప్రాయంగా హౌస్‌ మేట్స్‌ పేర్లను నామినేట్‌ చేయమన్నాడు. వారు మాత్రం ఏకాభిప్రాయంతో కాకుండా తలా ఓ ఆప్షన్‌ ఎంచుకున్నారు. ఇలా అందరూ తలా ఒక పేరు చెప్పారు. ఎక్కువ మంది కౌశల్‌, తేజస్వీల పేర్లు నామినేట్ చేయగా.. ఆ తర్వాత కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ పేరు చెప్పారు. కౌశల్‌ స్వార్ధపరుడని, తేజస్వీ గేమ్ మొత్తాన్ని నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందంటూ సభ్యులు మండిపడ్డారు. ఇక ఎలిమినేషన్‌ స్టార్‌ గణేశ్‌కు టాస్క్‌లు ఆడేంత సత్తా లేదని తేల్చిపారేశారు. పాపం గణేశ్‌ ప్రతీసారి నామినేట్‌ అవుతూనే ఉన్నాడు. అయితే గతంలో కాకుండా బిగ్‌బాస్‌ ఈ సారి నామినేట్‌ అయిన అందరిని ఎలిమినేషన్‌ జాబితాలో చేర్చాడు. దీంతో కౌశల్, తేజస్వీ, గీతామాధురి, బాబుగోగినేని, దీప్తి, శ్యామల, గణేశ్‌, నందిని రాయ్‌లు ఈ సారి  ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్నారు.

బిగ్‌బాస్‌ ఆఫర్‌.. కౌశల్‌కు ఎఫెక్ట్‌
తొలి ఎపిసోడ్‌లోనే కౌశల్‌ బిగ్‌బాస్‌ నుంచి లక్కీగా ఓ ఆఫర్‌ అందుకున్నాడు. అదే జైలు కార్డ్‌.. హౌస్‌లోని రూల్స్‌ బ్రేక్‌ చేస్తే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లకు శిక్షగా వారిని జైలులో వేస్తాడు. అయితే ఆ జైలు నుంచి విడిపించే సదుపాయాన్ని బిగ్‌బాస్‌ ఆ కార్డు ద్వారా కౌశల్‌కు కల్పించాడు. తొలి రోజే సామన్యులైన సంజనా, నూతన నాయుడులకు ఈ శిక్ష పడింది. అయితే ఓ అమ్మాయి జైలులో ఉన్న కూడా కార్డు ఉపయోగించలేదని హౌస్‌ మేట్స్‌ అంతా కౌశల్‌కు వ్యతిరేకమయ్యారు. ఇక అప్పటి నుంచి కొంతమంది అతన్నే టార్గెట్‌ కూడా చేశారు. ఈ వ్యవహారంలో కిరీటీ దామరాజు బలైన విషయం తెలిసిందే. నిజానికి కిరీటీ కౌశల్‌ పట్ల అలా ప్రవర్తించకుంటే కౌశల్‌ ఎప్పుడో వెళ్లి పోయేవాడు. ఆ ఒక్క ఘటనతో కౌశల్‌ హీరో కాగా.. కిరీటీ విలనై హౌస్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అంతేకాకుండా కౌశల్‌పై ప్రేక్షకులకు విపరీతమైన సానుభూతి వచ్చింది. దీంతో అతను ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోగా కామన్‌ మ్యాన్‌ నూతన నాయుడు బలయ్యాడు. ఈ విషయాన్ని హోస్ట్‌ నాని సైతం బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ అంటూ వివరణ కూడా ఇచ్చాడు.

ఈ ఘటన అనంతరం కౌశల్‌ అందరి హౌస్‌ మేట్స్‌తో దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఓ టాస్క్‌లో కెప్టెన్‌గా అదరగొట్టాడు కూడా. అయితే మరోసారి అతన్ని ఆ జైలు కార్డే స్వార్ధపరుడిని చేసింది. ఇంగ్లీష్‌ ఎక్కువగా మాట్లాడుతున్నాడని బాబు గోగినేని, మైక్‌ సరిగ్గా ధరించడం లేదని తనీష్‌ను బిగ్‌బాస్‌ కెప్టెన్ రోల్‌రైడా ద్వారా జైలుకు పంపించాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కార్డు ఉపయోగించడం లేదంటూ అతనిపై హౌస్‌ మేట్స్‌ ఫైర్‌ అయ్యారు. ముఖ్యంగా తేజస్వీ, సామ్రాట్‌, తనీష్‌, దీప్తీ సునయనా, గణేశ్‌, అమిత్‌లు అతనిపై పీకల దాకా కోపం తెచ్చుకుంటున్నారు. నిజానికి కౌశల్‌ బాబుగోగినేని, తనీష్‌లను కార్డు ఉపయోగించాలా అని అడిగినట్లు, వద్దని కూడా తాము చెప్పినట్లు వారే తెలిపారు. ఒక అమ్మాయి, అబ్బాయి జైలుకు వెళ్లినప్పుడు ఉపయోగిస్తే ఆ కార్డుకు విలువ ఉంటుందని కౌశల్‌ అభిప్రాయపడుతున్నాడు.

అయితే సంజనా విషయంలో ఉపయోగించకపోవడంతో కౌశల్‌ మాటలను హౌస్‌ మేట్స్‌ నమ్మడం లేదు. ఇక నామినేషన్‌ ప్రక్రియ గురించి చర్చించవద్దని బిగ్‌బాస్‌ హెచ్చరించినా పట్టించుకోని గీతా మాధురి అదే విషయంపై పదే పదే హౌస్‌ మేట్స్‌ వద్ద ప్రస్తావించింది. దీనికి బిగ్‌బాస్‌ ఆమెను జైలులో వేస్తూ శిక్ష విధించాడు. గీతా మాధురిని సైతం కౌశల్‌ కార్డు ఉపయోగించాలా అని అడగగా.. ఆమె తిరస్కరించినట్లు లేటేస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమోలో తెలుస్తోంది. ఆ కార్డు వాడేస్తే అయిపోతదిగా బ్రదర్‌ అని కౌశల్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ లక్కీ ఆఫరే కౌశల్‌ కొంపముంచుతోంది. కనీసం ఎలిమినేట్‌ అయ్యే లోపు అన్నా అతను ఈ విషయాన్ని గ్రహిస్తాడో లేదో మరీ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement