
హైదరాబాద్: గతంలో గతితప్పిన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పిన నటి శ్రీరెడ్డి మరోమారు అదే తీరును ప్రదర్శించారు. నటుడు, బిగ్‌బాస్-2 హోస్ట్ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమేననే అభిప్రాయం వెల్లడవుతున్నది.
మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు.
ఎందుకిలా?: మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజులుగా బిగ్ బాస్ 2లో శ్రీ రెడ్డి పాల్గొంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను బిగ్ బాస్ నిర్వాహకులు గానీ శ్రీరెడ్డి గానీ ధృవీకరించలేదు. కొంతకాలంగా నానిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి, బిగ్‌బాస్ ప్రసార సమయంలోనే బాంబ్ పేల్చే అవకాశముందని భావిస్తున్నారు ప్రేక్షకులు.