
శనివారం జరిగిన బిగ్‌బాస్ షో ఆసక్తిగా సాగింది. నాని చెప్పిన పిట్టకథ, దరువాటలు బాగానే అలరించాయి. నాని ఎంట్రీ ఇస్తూనే.. ‘అనగనగా ఓ రాజు.. రాజు ప్రేమగా పెంచుకున్న చిలుక.. ఓ సారి చిలుక ఓ పండును తీసుకొచ్చి.. రాజా ఈ పండును తింటే.. నిత్యయవ్వనంగా ఉంటారు.. అని చెబుతుంది. అప్పుడు రాజు గారికి అనుమానం వచ్చి ఓ సైనికుడికి ఇచ్చి తినమంటాడు. తిన్న వెంటనే సైనికుడు చనిపోతాడు.. వెంటనే ఆ రాజ్యంలోని ప్రజలు.. ఆ చిలుక మంచిది కాదని, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తోందని చెప్పడంతో.. నిజం తెలుసుకోకుండా.. ఆ చిలుకును చంపమని ఆజ్ఞ వేస్తాడు. అప్పటి నుంచి ఆ చెట్టు పండ్లను ఎవరూ తినకూడదని, చెట్టు చుట్టూ కంచె వేయిస్తాడు. ఒకసారి ఓ వృద్ధ దంపతులు ఆ రాజ్యంలోకి వస్తారు. బాగా ఆకలివేయడంతో ఆ చెట్టు గురించి తెలియకపోవడంతో.. వాటి పళ్లను తింటారు. తిన్న వెంటనే వారు నిత్య యవ్వనంలోకి వస్తారు. ఇది తెలిసి రాజు ఆశ్చర్యపోతాడు. చిలుక తెచ్చిన పండు పాము కాటు వేయడంతో విషం చేరిందని అసలు నిజం తెలుసుకున్న రాజు బాధపడ్డాడ’ని కథను ముగిస్తాడు నాని.
ఆకట్టుకున్న దరువాట...
ఈరోజు ఎలిమినేషన్‌ను ఫేస్ చేయబోతోన్న వారిలో ఒకరికి అన్వయించుకుని చెప్పిన ఈ కథ.. ఎవరికి వర్తిస్తుందో ఈపాటికే అర్థమై ఉంటుంది. అందరి మాటలు విని.. టాస్క్‌లో కౌశల్‌ను హింసించడంతో కిరిటీ విలన్‌గా మారిపోయాడు. దీంతో ఈ వారం దాదాపు కిరిటీ హౌజ్‌లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వారాంతం జరిగిన షో ఆద్యంతం ఉల్లాసంగా జరిగింది. దరువాట ఆడిపించి నాని బిగ్‌బాస్ ఇళ్లంతా సందడిని నింపేశారు. ఒక్కొక్కరు దరువేస్తూ.. వారికి ఇచ్చిన కవర్లో వచ్చిన పేర్లను చెప్పిన తీరు ఆకట్టుకుంది. ఇది ఆటగానే కాకుండా వారి మనుసులో అవతల వ్యక్తి గుంచి అనుకున్న భావాలు కూడా బయటపడేలా చేశారు నాని. తేజస్వితో ఇంకెంటి? ఇంకెంటి? అని నాని ఆటపట్టించడం ( తేజస్వి- సామ్రాట్‌ల విషయం గురించి అడుగుతూ ) బాగానే ఉంది. నేటి కార్యక్రమ ప్రసారంలో ఇంకేం జరుగనుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment