నటుడు, బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో బుధవారం మూడు ముళ్లు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. కోవిడ్ కారణంగా ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బిగ్‌బాస్‌లో తన స్నేహితులైన తనీష్, దీప్తీ సునాయనా కూడా హాజరయ్యారు. సామ్రాట్ పెళ్లి వార్త తెలిసిన నెటిజన్లు, అభిమనులు నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించిన వీడియోను సామ్రాట్ సోదరి, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: నటుడు సామ్రాట్ సోదరికి కరోనా
ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పేరు సంపాదించాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ టాప్ 5కు చేరాడు. ఇదిలా ఉండగా సామ్రాట్‌కు ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. ఇంతకముందు హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2018లో కట్నం కోసం వేధిస్తున్నాడని, తనపై హత్య ప్రయత్నం చేశాడని సామ్రాట్‌పై హర్షిత కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చదవండి: నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్
Comments
Please login to add a commentAdd a comment