తేజస్వీ, సామ్రాట్ మధ్య ఏదో జరుగుతోందని, తనీష్, దీప్తి సునయనల మధ్య సమ్‌థింగ్ ఉందంటూ బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రక్తికడుతున్న నాటకం కూడా హైలెట్‌గా నిలుస్తోంది. ఈవారానికి కౌశల్, గణేష్‌ను ఎక్కువ మంది ఇంటి సభ్యులు నామినేట్ చేయగా, శ్యామల, తేజస్వీ, బాబు గోగినేని, దీప్తి కూడా నామినేట్ అయ్యారు. నేడు ఇంకొంచెం స్పెషల్‌గా ఉంచేందుకు ఇంట్లోకి అతిథులు రాబోతున్నారు. ఈ అతిథులతో హౌజ్ అంతా సందడిగా మారబోతోంది.