Bigg Boss Telugu Contestants Names List - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 2 లో శ్రీరెడ్డి!?

May 31 2018 12:37 PM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss Telugu Season 2 Contestants List  - Sakshi

బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ షో సందడి మొదలు కానుంది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ సీజన్‌ 1 సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్‌ 2 పై టాలీవుడ్‌ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నేచురల్‌ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్‌ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించిన జాబితా ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. 

వైరల్‌ అవుతున్న లిస్ట్‌ ఇదే!
హీరో రాజ్ త‌రుణ్ , సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, యాంక‌ర్ లాస్య‌, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి, శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, ఆర్యన్‌ రాజేష్

ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌ అని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య తెలుగు చిత్రసీమలో వేధింపులు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సీజన్‌ 2లో పాల్గొనబోతుందనే వార్త షాకింగ్‌గా మారింది. శ్రీరెడ్డి నేచుర‌ల్ స్టార్ నాని, వైవా హ‌ర్షల‌పై కూడా పలు కామెంట్స్ చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న16 సెలబ్రిటీలలో ఎంతమంది నిజంగా షోలో ఉన్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement